Home న్యూస్ RRR మోషన్ పోస్టర్ రివ్యూ…గూస్ బంప్స్!! 9 లక్షల ట్వీట్స్ తో మెంటల్ మాస్ రికార్డ్!!

RRR మోషన్ పోస్టర్ రివ్యూ…గూస్ బంప్స్!! 9 లక్షల ట్వీట్స్ తో మెంటల్ మాస్ రికార్డ్!!

0

    మెగా అండ్ నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కుతున్న ఈ సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ఈ ఏడాదే రావాల్సి ఉన్నా పోస్ట్ పోన్ అయ్యి వచ్చే ఇయర్ సంక్రాంతి కి రిలీజ్ కానుండగా సినిమా అప్ డేట్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు.

కరోనా వైరస్ ఎఫెక్ట్ తో అందరూ ఇళ్లకే పరిమితం అవ్వగా వారిని ఉత్తేజిత పరచడానికి ఆర్.ఆర్.ఆర్ టీం ఉగాది కానుకగా సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. సినిమా టైటిల్ ని “రౌద్రం రణం రుధిరం” గా పెట్టారు. హిందీ లో “రైజ్ రోర్ రివోల్ట్” గా పెట్టారు.

ఇక మోషన్ పోస్టర్ అడుగడుగునా జక్కన్న మార్క్ కనిపించగా ప్రతీ సన్నివేశం గూస్ బంప్స్ తో నిండిపోయింది, ఇద్దరు హీరోల ఎంట్రీలు ఓ రేంజ్ లో కుమ్మేశాయి. రామ్ చరణ్ ఫేస్ క్లియర్ గా కనిపించగా ఎన్టీఆర్ ఫేస్ మాత్రం క్లియర్ గా కనిపించలేదు.

ఓవరాల్ గా మోషన్ పోస్టర్ రచ్చ మాములుగా జరగడం లేదు, సోషల్ మీడియా లో ఇప్పటికే మోషన్ పోస్టర్ అండ్ ఫస్ట్ లుక్ టైటిల్ అనౌన్స్ మెంట్ జరగడం తో ఇప్పటికే 9 లక్షల నుండి 1 మిలియన్ ట్వీట్స్ పోల్ అయ్యి సంచలనం సృష్టించింది. ఇక మోషన్ పోస్టర్ పరంగా యూట్యూబ్ లో ఇది వరకు…

బాహుబలి 2 మోషన్ పోస్టర్ 24 గంటల్లో 17.8 మిలియన్ వ్యూస్ తో టాప్ లో ఉండగా లైక్స్ పరంగా విశ్వాసం మోషన్ పోస్టర్ 551K లైక్స్ తో టాప్ లో ఉంది. ఇక మోషన్ పోస్టర్ రెస్పాన్స్ అదిరిపోగా 24 గంటల్లో ఎలాంటి రికార్డులను ఈ మోషన్ పోస్టర్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here