Home న్యూస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన రామ్ చరణ్ – ఎన్టీఆర్… అరాచకం అసలు!!

ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన రామ్ చరణ్ – ఎన్టీఆర్… అరాచకం అసలు!!

0

    టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్ భారీ ఎత్తున వచ్చే ఇయర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఇక రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా సినిమా అఫీషియల్ ఇంట్రో వీడియో ని యూనిట్ రిలీజ్ చేశారు. అందులో రామ్ చరణ్ క్యారెక్టర్ ఇంట్రో ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చెప్పించారు.

కాగా ఇంట్రో టీసర్ లో రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ యాటిట్యూడ్ ఓ రేంజ్ లో మెప్పించాగా జక్కన్న టేకింగ్ మరో లెవల్ లో ఉండగా ఆ టేకింగ్ కి ఏమాత్రం తీసిపోని బ్యాగ్రౌండ్ స్కోర్ తో కీరవాణి మెప్పించాడు.

ఇక ఇక్కడ అందరినీ మరింత ఆకట్టుకుంటుంది మాత్రం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, తెలంగాణ స్లాంగ్ లో తన వాయిస్ లో బేస్ తో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ కి మరెవ్వరూ ఇంతలా ఎలివేట్ చేయలేరు అనిపించే విధంగా తన గాత్రం తో దుమ్ము లేపాడు.

తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ఓన్ డబ్బింగ్ తో దుమ్ము లేపిన ఎన్టీఆర్ మెప్పించాగా రామ్ చరణ్ తన ఫ్యాన్స్ కి అద్బుతమైన బర్త్ డే గిఫ్ట్ ని ఈ టీసర్ తో అందించాడు. చూస్తుంటే వచ్చే ఏడాది ఈ సినిమా తో టాలీవుడ్ లో అనేక రికార్డులు బద్దలు అయ్యేలా కనిపిస్తుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here