మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్, బాక్స్ ఆఫీస్ దగ్గర కొంతకాలం వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకున్న సాయి ధరం తేజ్ రీసెంట్ గా బాక్ టు బాక్ హిట్స్ తో కంబ్యాక్ ఇచ్చి మంచి జోరు మీదున్న నేపధ్యంలో ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ ని అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇయర్ సమ్మర్ లోనే రిలీజ్ అనుకున్నా కరోనా వలన కుదరలేదు.
సినిమా అప్పటి నుండి డైరెక్ట్ రిలీజా లేక థియేటర్స్ లో రిలీజ్ అవ్వాలా అన్న డౌట్ లోనే ఉంటూ రాగా వచ్చిన డైరెక్ట్ రిలీజ్ ఆఫర్లలో జీ 5 ఇచ్చిన భారీ ఆఫర్ తో ఇక్కడే ఫిక్స్ అయినప్పటికీ తర్వాత మారిన పరిస్థితుల నేపధ్యంలో పే పెర్ వ్యూ పద్దతిలో…
సినిమాను రిలీజ్ చేయండి అంటూ యూనిట్ ని మాటి మాటికి జీ వాళ్ళు సంప్రదింపులు జరుపుతూ రాగా ఆ పద్దతిలో రిలీజ్ అయిన సినిమాల ఫలితాలు చూసిన సాయి ధరం తేజ్ ఈ పద్దతి వద్దూ అనుకుని డైరెక్ట్ రిలీజ్ కి ఆఫర్ల కోసం ఎదురు చూడటం మొదలు పెట్టారట ఈ మధ్య…
కానీ ఆ ఆఫర్లు కూడా అనుకున్న రేంజ్ లో రాకపోవడం తో ఇక నిర్ణయం మార్చుకుని ఇక సినిమా ను డైరెక్ట్ రిలీజ్ చేయనే చేయకూడదని, తప్పో ఒప్పో, లాభమో నష్టమో ఇప్పుడు సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయలానే డిసైడ్ అయ్యారని టాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది, అందుకే సినిమా ఇప్పుడు….
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు… ఎలాగూ సగం కెపాసిటీ తో రన్ అయినా మరో సినిమా పోటి లో కొంత టైం వరకు ఏవి లేవు కాబట్టి లాంగ్ రన్ ఉంటుందని నమ్మకంతో ఈ పోరాటం చేయబోతున్నారని అంటున్నారు. దీనిపై త్వరలోనే అనౌన్స్ మెంట్ కూడా రాబోతుందని లేటెస్ట్ టాక్ మరి.