మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ మారుతి ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ప్రతీరోజూ పండగే బాక్స్ ఆఫీస్ దగ్గర నేడు భారీ ఎత్తున రిలీజ్ అయింది, సినిమా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను పూర్తీ చేసుకోగా అక్కడ నుండి ఎలాంటి టాక్ ని సినిమా సొంతం చేసుకుందో తెలుసు కుందాం పదండీ.
కథ పాయింట్ ట్రైలర్ చెప్పినట్లే లంగ్ కాన్సర్ తో నెలరోజుల్లో చనిపోబోతున్న తాతయ్య తన ఫ్యామిలీ మొత్తాన్ని తిరిగి చూడాలి అని కోరుకున్న కోరికను మనవడు ఎలా తీర్చాడు అన్నది ఓవరాల్ కాన్సెప్ట్ అని అంటున్నారు. సినిమా లో సత్యరాజ్, రావ్ రమేష్ ల పెర్ఫార్మెన్స్ ఆకట్టుకోగా…
సాయి ధరం తేజ్ తాను ఉన్నంత సేపు ఆకట్టుకున్నాడని, హీరోయిన్ రాశిఖన్నా తో లవ్ ట్రాక్ చాలా బాగుందని, సాంగ్స్ లో బాగా డాన్స్ చేశాడని ఫైట్స్ కూడా దుమ్ము లేపాడని అంటున్నారు, రాశిఖన్నా కామిక్ టైమింగ్ తో ఆకట్టుకోగా చూడటానికి కూడా బాగుందని అంటున్నారు.
సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి తగ్గట్లు ఆకట్టుకోగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే స్లో గా ఉందని, కథ మొదలు అవ్వడానికి ఆ కథ ముదుకు సాగడానికి టైం తీసుకుంటూ స్క్రీన్ ప్లే ఉంటుంది, ఎలాంటి ట్విస్ట్ లు లాంటివి లేకుండా సింపుల్ గా సినిమా ఉంటుందని అంటున్నారు.
ఓవరాల్ గా ఫస్టాఫ్ అండ్ సెకెండ్ ఆఫ్ లో కామెడీ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్, క్లైమాక్స్ సెంటిమెంట్ సీన్స్ ఇలా కొన్ని మంచి సీన్స్ సినిమా స్లో అయిన ఫీలింగ్ కలిగినప్పుడల్లా పడి సినిమా బాగుంది అనిపించేలా చేస్తుందని అంటున్నారు. ఓవరాల్ గా ఓవర్సీస్ ఆడియన్స్ నుండి సినిమాకు…
ఎబో యావరేజ్ నుండి హిట్ రేంజ్ టాక్ ఎక్కువగా వినిపిస్తుందని అని చెప్పొచ్చు. ఈ రోజు పోటి లో ఉన్న మూవీస్ లో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇదే కాబట్టి ఈ రేంజ్ టాక్ రోజు మొత్తం కంటిన్యు అయినా సంక్రాంతి వరకు డోకా ఉండదని చెప్పొచ్చు. మరి రెగ్యులర్ షోల టాక్ ఎలా ఉంటుందో చూడాలి.