మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టడం హాట్రిక్ విజయాలతో మొదలు పెట్టిన తర్వాత వరుస పెట్టి ఫ్లాఫ్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురుకుని మార్కెట్ కోల్పోతున్న టైం లో రెండేళ్ళ క్రితం చిత్రలహరి, తర్వాత ప్రతీ రోజూ పండగే సినిమాలతో బాక్ టు బాక్ సూపర్ హిట్లు కొట్టగా తర్వాత ఫస్ట్ వేవ్ తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ తో టాలీవుడ్ కి…
ఫస్ట్ హిట్ ని ఇచ్చాడు… ఈ సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు ఈ సమ్మర్ లో రావాల్సిన రిపబ్లిక్ సినిమా సెకెండ్ వేవ్ వలన డిలే అవ్వగా డైరెక్ట్ రిలీజ్ కి మంచి ఆఫర్స్ వచ్చినా నో చెప్పిన టీం థియేటర్స్ లో సినిమా రీసెంట్ గానే రిలీజ్ చేయగా…
సినిమా పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ ఈ సీరియస్ మూవీ ని చూడటానికి పెద్దగా ఆసక్తి అయితే చూపలేదు, ఆ ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగానే పడి సినిమా మొత్తం మీద 12.5 కోట్ల టార్గెట్ కి 6.86 కోట్ల షేర్ ని మాత్ర్రమే కలెక్ట్ చేసి…
బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా తర్వాత రీసెంట్ గా మంచి ప్రమోషన్స్ తో డిజిటల్ లో జీ 5 యాప్ లో రిలీజ్ అవ్వగా సినిమా అక్కడ సెన్సేషనల్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని మొదటి వారంలో 12 కోట్ల నిమిషాల వ్యూవర్ షిప్ ను తర్వాత 10 రోజుల తర్వాత టోటల్ గా ఇప్పుడు….
15 కోట్ల నిమిషాల వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. బాక్స్ ఆఫీస్ డిసాస్టర్ అయినా కానీ డిజిటల్ లో ఊహకందని రెస్పాన్స్ ను సొంతం చేసుకుని అల్టిమేట్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతుందని జీ వాళ్ళు చెబుతూ ఉండటం విశేషం. ఇక టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయినప్పుడు ఎలాంటి రేటింగ్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.