మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కెరీర్ లో ప్రస్తుతం మళ్ళీ వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్నాడు, కెరీర్ మొదట్లో హాట్రిక్ హిట్స్ తో అల్టిమేట్ స్టార్ట్ ని సొంతం చేసుకున్న సాయి ధరం తేజ్ తర్వాత వరుసగా ఫ్లాఫ్ మూవీస్ ఒకటి తర్వాత ఒకటి రావడం తో పూర్తిగా మార్కెట్ కోల్పోయే స్టేజ్ కి వచ్చాడు, అలాంటి టైం లో తిరిగి చిత్రలహరి సినిమా తో కంబ్యాక్ ఇవ్వగా…
వెంటనే ఇయర్ ఎండ్ లో ప్రతిరోజూ పండగే సినిమా తో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని కూడా సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాడు. ఇక హాట్రిక్ పై నమ్మకం తో సోలో బ్రతుకే సో బెటర్ అంటూ కొత్త సినిమా తో సమ్మర్ రేసులో ఎంటర్ అవ్వాల్సింది కానీ..
కరోనా వలన సినిమా కి ఎదురుదెబ్బ తగలగా థియేటర్స్ రీ ఓపెన్ చేశాక సినిమాను రిలీజ్ చేస్తారు అనుకున్నా కానీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు మిగిలిన సినిమాలకు రేటు తగ్గినా ఈ సినిమా కి మాత్రం బెటర్ రేటు రావడం తో ఆల్ మోస్ట్.. ఇక డిజిటల్ రిలీజ్ ను…
కన్ఫాం చేసుకోబోతున్న ఈ సినిమా బాలెన్స్ కొన్ని రోజుల షూటింగ్ ఉండగా ఆ షూటింగ్ ని రీసెంట్ గా కంప్లీట్ చేశారు. దాంతో సినిమా కి గుమ్మడికాయ కొట్టేయగా ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం. అది కంప్లీట్ అయ్యాక సినిమా ను అఫీషియల్ డైరెక్ట్ రిలీజ్ కి సిద్ధం చేస్తారని అంటున్నారు.
ఇక సినిమా కు ముందు 22-23 కోట్ల రేంజ్ డైరెక్ట్ రిలీజ్ ఆఫర్లు దక్కగా సినిమా కి రీసెంట్ గా 25 కోట్ల రేంజ్ ఆఫర్ రావడం తో ఆల్ మోస్ట్ ఈ ఆఫర్ కి యూనిట్ ఓకే అన్నట్లు టాక్ వినిపిస్తుంది. సాయి ధరం తేజ్ ప్రీవియస్ మూవీ ప్రతిరోజూ పండగే బిజినెస్ కన్నా ఇది 6 కోట్ల రేంజ్ అధికం అనే చెప్పాలి. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో రిలీజ్ అవ్వబోతున్నాయి.