మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కెరీర్ మొదలు పెట్టడం వరుస విజయాలతో మొదలు పెట్టినా తర్వాత వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అయినా 2019 లో చిత్రలహరి మరియు ప్రతి రోజూ పండగే సినిమాలతో బాక్ టు బాక్ హిట్స్ తో దుమ్ము లేపగా ఇప్పుడు హాట్రిక్ కి సిద్ధం అయిన సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 25 న రిలీజ్ కానున్న..
ఈ సినిమాను జీ 5 వాళ్ళు గంప గుత్తు గా 38 కోట్ల రేటు కి కొన్న విషయం తెలిసిందే. తర్వాత థియేట్రికల్ రైట్స్ ని తామే అమ్ముకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సాయి ధరం తేజ్ చేస్తున్న కొత్త సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ అయిన దేవకట్ట డైరెక్షన్ లో చేయబోతున్న విషయం తెలిసిందే.
డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ IAS ఆఫీసర్ గా కనిపించ బోతున్నారని సమాచారం… ఇక ఈ సినిమా గురించిన ఆసక్తికరమైన బిజినెస్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను సాలిడ్ రేటు కి కొన్న జీ 5 వాళ్ళు…
ఆ సినిమా ఇంకా రిలీజ్ కాక ముందే ఈ సినిమా కి కూడా డీల్ ని సెట్ చేసుకున్నారని సమాచారం. సినిమా ఎంత బడ్జెట్ లో తెరకేక్కుతుందో తెలియదు కానీ ఓవరాల్ గా బిజినెస్ పరంగా అన్ని రైట్స్ ని తమ దగ్గరే పెట్టుకున్న జీ నెట్ వర్క్ వాళ్ళు 35 కోట్లకు పైగా రేటు చెల్లించి హక్కులను అన్ని సొంతం చేసుకున్నారని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు…
ఇంకా కంప్లీట్ అవ్వని సినిమా కి కూడా బిజినెస్ ఇప్పుడే జరిగిపోవడం విశేషం అనే చెప్పాలి. అన్ని హక్కులను సొంతం చేసుకున్న జీ నెట్ వర్క్ సినిమా శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ అండ్ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకుని తర్వాత సినిమా బజ్ ని బట్టి మంచి రేటుకి అమ్ముకుంటారని అంటున్నారు. ఇక 25 న సోలో బ్రతుకే సో బెటర్ ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.