మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కెరీర్ మొదలు పెట్టడం హాట్రిక్ విజయాలతో మొదలు పెట్టగా తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్ మూవీస్ తో ఆల్ మోస్ట్ తన మార్కెట్ ని కోల్పోయే స్టేజ్ కి వచ్చాడు, సరైన టైం లో కంబ్యాక్ రూపంలో చిత్రలహరి సినిమా పడటం తో కొంత ఊపిరి పీల్చుకున్న సాయి ధరం తేజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతిరోజూ పండగే సినిమా తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు…
దాంతో ఇప్పుడు హాట్రిక్ పై కన్నేసిన సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో సమ్మర్ లో సందడి చేయాలి అనుకున్నా కరోనా వలన కుదరలేదు కానీ సినిమాను క్రిస్టమస్ కానుకగా థియేటర్స్ ని రీ ఓపెన్ చేయించి భారీ లెవల్ లోనే రిలీజ్ చేశారు.
కాగా సినిమా మొదటి రోజు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 2.91 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 3.43 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఒకసారి ఈ కలెక్షన్స్ ని చిత్రలహరి మరియు ప్రతిరోజూ పండగే సినిమాలతో కంపేర్ చేసి చూస్తె…. ముందుగా…
చిత్రలహరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 3.26 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 4.21 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. ఇక ప్రతి రోజూ పండగే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 3.23 కోట్ల షేర్ ని వసూల్ చేయగా వరల్డ్ వైడ్ గా 4.33 కోట్ల షేర్ ని వసూల్ చేసింది. ఈ రెండు నార్మల్ టైం లో రిలీజ్ అయిన సినిమా లు కాగా ఫుల్ కెపాసిటీ తో రిలీజ్ అయ్యాయి.
అదే టైం లో 50% ఆక్యుపెన్సీ లిమిటేషన్లు, థియేటర్ రీ ఓపెన్ ఇప్పుడే అవ్వడం, జనాలు పెద్దగా రావడానికి ఆసక్తి చూపని టైం లో సోలో బ్రతుకే సో బెటర్ సాధించిన కలెక్షన్స్ అద్బుతం అనే చెప్పాలి. ఇక వీకెండ్ లో సినిమా మినిమమ్ కలెక్షన్స్ లో ఇలానే జోరు చూపితే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు.