బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం సమ్మర్ టైంలో విరూపాక్ష సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్(Sai Dharam Tej)…విరూపాక్ష సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకోగా టోటల్ రన్ లో ఆ సినిమా ఏకంగా 91 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..
ఆ సినిమా తర్వాత సాయి ధరం తేజ్ నటిస్తున్న కొత్త సినిమా అఫీషియల్ గ్లిమ్స్ ను 2 నెలల క్రితమే రిలీజ్ చేశారు…SYG – సంబరాల యేటి గట్టు(SYG – Sambarala Yeti Gattu) పేరుతో ఓ భారీ యాక్షన్ మూవీ రూపొందుతూ ఉండగా…టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోతోనే…
ఈ సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి…ఇక సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటూ ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా ఈ సినిమా బడ్జెట్ గురించిన వార్తా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది….
సాయి ధరం తేజ్ నార్మల్ మార్కెట్ రేంజ్ కి మించి ఈ సినిమా బడ్జెట్ భారీ రేంజ్ పాన్ ఇండియా మూవీ గా రూపొందబోతూ ఉండగా ఇప్పుడు బడ్జెట్ కూడా ముందు అనుకున్న లెక్కలను మించి పోయి ఏకంగా 125 కోట్ల మమ్మోత్ రేటు తో నిర్మాణం అవుతుందని సమాచారం…
125 కోట్ల రేంజ్ మమ్మోత్ రేటు బడ్జెట్ రికవరీ అవ్వడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. కానీ సినిమా కంటెంట్ బాగుంది అనిపించే రేంజ్ లో ఉండి పాన్ ఇండియా రేంజ్ లో వర్కౌట్ అయ్యే రేంజ్ లో కంటెంట్ ఉంటే రికవరీకి అవకాశం ఉంటుంది. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.