Home న్యూస్ బాలీవుడ్ లో కుమ్మేస్తున్న సైతాన్…వీకెండ్ లో కలెక్షన్స్ ఊచకోత!

బాలీవుడ్ లో కుమ్మేస్తున్న సైతాన్…వీకెండ్ లో కలెక్షన్స్ ఊచకోత!

0

 అజయ్ దేవగన్(Ajay Devgn) ఆర్ మాధవన్(R Madhavan) ల కాంబినేషన్ లో వచ్చిన సైతాన్(Shaitaan Movie Collections) మూవీ రీసెంట్ గా హిందీలో రిలీజ్ అవ్వగా అద్బుతమైన కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. సినిమా కి మంచి రివ్యూలు ఆడియన్స్ నుండి సొంతం అవ్వడంతో మౌత్ టాక్…

అంతటా స్ప్రెడ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి ఇది ప్లస్ అయ్యి అన్ సీజన్ అనుకున్న మార్చ్ లో కూడా ఈ సినిమాకి సాలిడ్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా మొదటి రోజు 15.21 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా రెండో రోజు….

మంచి జోరుని చూపించి 19.18 కోట్ల రేంజ్ లో దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, ఇక మూడో రోజు వసూళ్లు ఆల్ మోస్ట్ 21 కోట్ల రేంజ్ లో ఉండగా వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా ఓవరాల్ గా 55 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపే రేంజ్ లో దూసుకు పోతుంది..

నార్మల్ కమర్షియల్ మూవీ కి ఇలాంటి కలెక్షన్స్ అంటే మామూలుగానే వస్తూ ఉంటాయి కానీ ఎక్స్ పెరిమెంటల్ కథకి ఆడియన్స్ నుండి ఇలాంటి రెస్పాన్స్ వస్తూ ఉండటం మాత్రం విశేషం అనే చెప్పాలి. సినిమా ఊపు చూస్తూ ఉంటే లాంగ్ రన్ లో 200 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అవలీలగా అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here