Home న్యూస్ 150 కోట్ల సినిమా…ఇండస్ట్రీ రికార్డ్ వైపు ప్రయాణం….కానీ OTT లో కొనడానికి ఎవ్వరూ రావడం లేదు!

150 కోట్ల సినిమా…ఇండస్ట్రీ రికార్డ్ వైపు ప్రయాణం….కానీ OTT లో కొనడానికి ఎవ్వరూ రావడం లేదు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని సినిమాలకు కూడా నాన్ థియేట్రికల్ రైట్స్ అనుకున్న విధంగా సొంతం అవ్వవు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో దూసుకు పోతున్న సినిమాకి డిజిటల్ లో కానీ శాటిలైట్ రైట్స్ కానీ సాలిడ్ రేటు కి కొని తమ ప్లాట్ ఫామ్ లో ఆ సినిమాలు ఉండాలి అనుకుంటారు చాలా మంది…

కానీ దీనికి విరుద్ధంగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళంలో రికార్డుల దుమ్ము దుమారం సృష్టిస్తూ దూసుకు పోతున్న మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys) సినిమా పరిస్థితి మాత్రం పూర్తిగా డిఫెరెంట్ గా ఉందని చెప్పాలి. ఈ సినిమా ఒక పక్క బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేప కలెక్షన్స్ తో…

ఆల్ మోస్ట్ 150 కోట్ల రేంజ్ లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని అందుకుని మలయాళంలో కొత్త ఇండస్ట్రీ హిట్ వైపు దూసుకు పోతూ ఉండగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని అక్కడ స్ట్రాంగ్ బజ్ ఉంది. రిలీజ్ కి ముందు సినిమా డిజిటల్ రైట్స్ కి చాలా తక్కువ రేటు ఆఫర్ అవ్వడంతో…

అప్పుడు డిజిటల్ రైట్స్ ను మేకర్స్ అమ్మలేదు, తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఊహకందని విజయాన్ని నమోదు చేయగా ఇప్పుడు మేకర్స్ సినిమా సక్సెస్ చూసి డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా 20 కోట్ల రేంజ్ లో రేటుని ఎక్స్ పెర్ట్ చేస్తున్నారట. ఆ రేంజ్ లో రేటు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాక పోవడంతో…

సినిమా డిజిటల్ రైట్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని సమాచారం. డిజిటల్ రైట్స్ కోసం చాలా మంది 10 కోట్ల దాకా రేటుని ఆఫర్ చేశారట. మలయాళ మార్కెట్ దృశ్యా ఈ రేటు కూడా భారీ రేటు అనే చెప్పాలి. కానీ మేకర్స్ ఇంకా ఎక్కువగా ఆశిస్తున్నారు, దాంతో సినిమా డిజిటల్ రైట్స్ ఇంకా సొల్ద్ ఔట్ అవ్వలేదు. మరి ఫైనల్ గా ఏ రేటుకి డిజిటల్ రైట్స్ అమ్ముడు పోతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here