Home న్యూస్ మమ్మోత్ సలార్ ట్రైలర్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే!

మమ్మోత్ సలార్ ట్రైలర్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర క్రిస్టమస్ కానుకగా భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ సలార్(Salaar Movie) భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…

సినిమా అఫీషియల్ ట్రైలర్ ను ఇప్పుడు ఆడియన్స్ ముందుకు డిసెంబర్ 1న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తూ ఉండగా ట్రైలర్ రిలీజ్ కన్నా ముందే భారీ హైప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ కనుక క్లిక్ అయితే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ను ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా తెలుగు వరకు చూసుకుంటే 24 గంటల్లో ఓవరాల్ గా ప్రస్తుతానికి సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ 26.77 మిలియన్ వ్యూస్ తో టాప్ ప్లేస్ లో దూసుకు పోతుంది… ఇక లైక్స్ పరంగా చూసుకుంటే…

RRR మూవీ 24 గంటల్లో 1.24 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఈ రికార్డులను సలార్ ట్రైలర్ బ్రేక్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి… ఇక సౌత్ పరంగా చూసుకుంటే లియో ట్రైలర్ 24 గంటల్లో 31.91 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది…

లైక్స్ పరంగా లియో ట్రైలర్ 2.64 మిలియన్ లైక్స్ మార్క్ తో రికార్డ్ నమోదు చేసింది. ఇక సలార్ ట్రైలర్ ఏ రేంజ్ లో రచ్చ లేపుతుంది ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో త్వరలో తేలనుంది. ఏమాత్రం ట్రైలర్ బాగున్నా రికార్డులతో ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here