Home న్యూస్ యానిమల్ AP-TG బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!

యానిమల్ AP-TG బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శుక్రవారం భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న క్రేజీ మూవీ యానిమల్(Animal Movie). రణబీర్ కపూర్(Ranbir Kapoor) కెరీర్ లోనే ఏ సినిమాకి లేనంత హైప్ తో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మీద అంచనాలు స్కై హై లెవల్ లో ఉండగా అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగ నుండి వస్తున్న మూవీ అవ్వడంతో….

అంచనాలు మరో లెవల్ లో ఉన్నాయి, ఇక సినిమా ట్రైలర్ కూడా ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకోవడంతో బజ్ మరింతగా పెరిగి పోగా సినిమా బిజినెస్ కూడా అన్ని చోట్లా సాలిడ్ గా సాగుతుంది, హిందీలో పెర్సేంటేజ్ బేస్ తో రిలీజ్ అవుతున్న ఈ సినిమా అక్కడ ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను…

సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా తెలుగు రాష్ట్రాలలో మాత్రం మంచి రేటుకి సినిమా బిజినెస్ జరిగింది ఇప్పుడు, ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో వాల్యూ బిజినెస్ రేంజ్ 14 కోట్లకు పైగా సొంతం చేసుకుంది ఈ సినిమా. రణబీర్ కపూర్ కెరీర్ లో ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి.

నైజాంలో భారీ లెవల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఆంధ్ర సీడెడ్ లలో కూడా ఒక పెద్ద సినిమా ఏ రేంజ్ లో రిలీజ్ కానుందో అలాంటి థియేటర్స్ కౌంట్ ను సొంతం చేసుకోబోతుంది, ఇక తెలుగు లో సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది…

ఓవరాల్ గా సినిమా మీద ఉన్న క్రేజ్ దృశ్యా ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా కూడా ఈ కలెక్షన్స్ ని అవలీలగా సినిమా అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు, అర్జున్ రెడ్డి రేంజ్ లో టాక్ వస్తే ఇక సినిమా కలెక్షన్స్ రాంపేజ్ మరో లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here