ఫస్ట్ వేవ్ తర్వాత ఈ ఇయర్ స్టార్టింగ్ లో అన్ని ఇండస్ట్రీలు తిరిగి తేరుకుని వరుస విజయాలతో దుమ్ము లేపగా బాలీవుడ్ వాళ్ళు మాత్రం ఇంకా మొదటి హిట్ కొట్టలేదు, అప్పటి నుండి ఎప్పుడెప్పుడు మొదటి హిట్ కొడతారా అని ఎదురు చూడగా సడెన్ గా సెకెండ్ వేవ్ ఊహకందని లెవల్ లో అందరికీ షాకిచ్చి పరిస్థితులు మొత్తం తారుమారు అయ్యేలా చేసింది. దాంతో మళ్ళీ అన్ని ఇండస్ట్రీ లకు గట్టి దెబ్బ పడింది.
ఇలాంటి టైం లో ఏడాది నుండి రిలీజ్ ను ఆపుతూ వచ్చిన సల్మాన్ ఖాన్ రాధే సినిమాను ఇక థియేటర్స్ లో అలాగే డిజిటల్ లో ఒకే సారి రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. 13 న రిలీజ్ కానున్న ఈ సినిమా ఇండియా లో థియేటర్స్ తెరచి ఉన్న….
చోట రిలీజ్ చేస్తూ అలాగే డిజిటల్ లో పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ సెకెండ్ వేవ్ వలన ఒక్క థియేటర్ కూడా తెరవలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇండియా లో థియేటర్స్ లో సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అని తేలగా ఓవర్సీస్ లో మట్టుకు…
చాలా చోట్ల పరిస్థితులు బాగానే ఉన్న నేపధ్యం లో సుమారు 350 లోకేషన్స్ లో రాధే సినిమా ను రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది, ఇక్కడ చాన్స్ లేదు కానీ అక్కడ మాత్రం 350 లోకేషన్స్ లో ఆల్ మోస్ట్ 600 వరకు థియేటర్స్ లో రాదే సినిమా రిలీజ్ కాబోతుందని అంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ మొదలు అవ్వగా రెస్పాన్స్ ఆడియన్స్ నుండి..
బాగానే వస్తుందని అంటున్నారు. ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంత సాధిస్తే అంత సినిమా కి బోనస్ అని చెప్పొచ్చు. ఇక సినిమా అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక పే పెర్ వ్యూ పద్దతిలో ఇండియా లో రిలీజ్ అవుతున్న సినిమా ఒక్క టికెట్ రేటు 249 పెట్టడం తో ఇక్కడ ఫస్ట్ డే ఎంతమంది చూడటానికి రెడీ గా ఉన్నారో చూడాలి ఇక.