Home న్యూస్ టాలీవుడ్ లో ఇదే రికార్డ్….ఫస్ట్ రికార్డ్ కొట్టిన హీరోయిన్ సమంత!!

టాలీవుడ్ లో ఇదే రికార్డ్….ఫస్ట్ రికార్డ్ కొట్టిన హీరోయిన్ సమంత!!

0

ఇప్పటి వరకు టాలీవుడ్ లో హీరోల సినిమాల యానివర్సరీ ట్రెండ్స్ మాత్రమె ఎక్కువగా జరిగాయి, ఎక్కువగా ఏంటి మొత్తం జరిగినవే వాళ్ళవి, హీరోల యానివర్సరీ ట్రెండ్స్, బర్త్ డే ట్రెండ్స్ ఇలా అన్ని ట్రెండ్స్ కూడా హీరోలవె ఎక్కువగా జరగగా హీరోయిన్స్ విషయం లో మాత్రం కొందరి బర్త్ డే ట్రెండ్స్ మాత్రం జరిగేవి. కానీ ఇప్పుడు మొట్ట మొదటి సారిగా హీరోయిన్ సినిమాకి యానివర్సరీ ట్రెండ్ జరగడం టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది.

లాస్ట్ ఇయర్ సమంత అక్కినేని నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఓ బేబి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడమే కాకుండా లాంగ్ రన్ లో నిర్మాతల లెక్కల ప్రకారం ఏకంగా 18 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడాది పూర్తీ అయిన సందర్బంగా సోషల్ మీడియా సమంత ఫ్యాన్స్ భారీ ట్రెండ్ చేశారు. ఫస్ట్ టైం ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ కి యానివర్సరీ ట్రెండ్ జరగడం జరగగా ఆ ట్రెండ్ 24 గంటల్లో భారీ ట్వీట్స్ పోల్ అయ్యాయి.

మొత్తం మీద 24 గంటలు కంప్లీట్ అయ్యే సమయానికి ఏకంగా 1 లక్షా 26.6 వేలకు పైగా ట్వీట్స్ పోల్ అవ్వగా ఇదే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో మొట్ట మొదటి యానివర్సరీ ట్రెండ్ తో పాటు బిగ్గెస్ట్ హీరోయిన్ మూవీ యానివర్సరీ ట్రెండ్ గాను నిలిచి సంచలనం సృష్టించింది. నందిని రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా…

లాస్ట్ ఇయర్ మంచి ప్రాఫిట్స్ సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచి దుమ్ము లేపగా… సమంత కెరీర్ లో చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం విశేషం. ఇక ఇప్పుడు యానివర్సరీ ట్రెండ్ తో ఇక మీదట రాబోయే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి భారీ టార్గెట్ ని సెట్ చేసింది ఓ బేబి సినిమా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here