యాక్షన్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ సామాన్యుడు పెద్దగా ప్రమోషన్స్ లాంటివి తెలుగు లో లేకున్నా కానీ విశాల్ వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కానీ తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ బిజినెస్ నే సొంతం చేసుకుంది. ఏకంగా 5.1 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 580 వరకు థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ నే సొంతం చేసుకుంది…
కానీ సినిమా టాక్ మిక్సుడ్ గా ఉండటం తో ఓపెనింగ్స్ నుండే సినిమా అండర్ పెర్ఫార్మ్ చేయడం మొదలు పెట్టగా ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో సినిమా టాక్ ని కూడా కన్సిడర్ చేస్తే సినిమా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి…
ఈ కలెక్షన్స్ అసలు సరిపోవు అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 3 వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ వలన అనుకున్న దానికన్నా బెటర్ కలెక్షన్స్ తో కుమ్మింది అని చెప్పాలి. సినిమా 30 లక్షల నుండి 35 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని సాధిస్తుంది అనుకున్నా కానీ సినిమా ఆ మార్క్ ని అధిగమించి….
బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు 41 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో సినిమా మూడు రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 27L
👉Ceeded: 22L
👉UA: 17L
👉East: 14L
👉West: 8L
👉Guntur: 12L
👉Krishna: 9L
👉Nellore: 6L
AP-TG Total:- 1.15CR(2.05CR~ Gross)
ఇదీ సినిమా మూడు రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్….
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 5.5 కోట్ల టార్గెట్ ను అందుకోవాల్సి ఉండగా మొదటి మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 4.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది, అది దాదాపు అసాధ్యమే అయినా సినిమా గట్టిగా హోల్డ్ చేస్తే లాస్ ని అయినా కవర్ చేసే అవకాశం ఉంటుంది.