రీసెంట్ టైం లో ఆడియన్స్ ను అనుకున్న రేంజ్ లో అలరించలేక పోతున్న యాక్షన్ హీరో విశాల్ నటించిన సరికొత్త సినిమా సామాన్యుడు ప్రేక్షకుల ముందుకు తమిళ్ తో పాటు తెలుగు లో ఒకే టైం లో రిలీజ్ అయింది, ట్రైలర్ చూస్తె పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుంది ఆడియన్స్ ను మెప్పిస్తుంది అనిపించగా ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసు కుందాం పదండీ….
ముందుగా కథ పాయింట్ కి వస్తే స్టడీస్ కంప్లీట్ అయ్యాక పోలిస్ అవ్వాలి అనుకునే హీరో గొడవలకు వెళ్ళకుండా తండ్రి చూసుకుంటూ ఉంటాడు. అలాంటి హీరో లవ్ లైఫ్ ఒక వైపు సాగుతూ ఉండగా సడెన్ గా తన చెల్లెలు హత్య జరుగుతుంది, తర్వాత ఆమె స్నేహితుడు హత్య జరుగుతుంది. అసలు ఈ మిస్టరీని హీరో ఎలా….
సాల్వ్ చేశాడు అన్నది మొత్తం మీద సినిమా కథ పాయింట్…. ఇలాంటి కథలను ఆల్ రెడీ చాలా సినిమాలలో మనం చూసేసి ఉన్నాం, కథలో ఏమాత్రం కొత్తదనం లేక పోవడంతో సినిమా స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగుతూ ఉంటుంది, అసలే 2 గంటల 45 నిమిషాల లెంత్ అండ్ స్లో నరేషన్ ఒక స్టేజ్ కి వచ్చేసరికి విసుగు తెప్పిస్తుంది…
ఉన్నంతలో విశాల్ తన రోల్ వరకు ఆకట్టుకున్నా సినిమాను కాపాడలేకపోయాడు. హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించగా యువన్ శంకర్ రాజా సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా యావరేజ్ గానే ఉంది, లెంత్ ఎక్కువ అవ్వడం, కొన్ని సీన్స్ మరీ సిల్లీగా ఉండటం, కథ ఆసక్తిగా చెప్పలేక పోవడం, ఇలా సినిమాలో మైనస్ లు చాలానే ఉన్నాయి…
అన్నింటినీ ఓపికతో కష్టపడి బరించి చూస్తె ఎదో పర్వాలేదు అనిపించేలా ఉంటుంది, విశాల్ అభిమన్యుడు రేంజ్ ఎక్స్ పెర్ట్ చేస్తే మాత్రం నిరాశ కలగక మానదు అని చెప్పాలి. ఓవరాల్ గా విశాల్ కంబ్యాక్ మూవీ అనుకుంటే సామాన్యుడు చాలా వరకు నిరాశ కలిగించింది అని చెప్పాలి… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2 స్టార్స్…