Home న్యూస్ బాలయ్య సమరసింహారెడ్డి రీ రిలీజ్ ఇన్ని థియేటర్స్ లో ఏంటి సామి…అరాచకం!

బాలయ్య సమరసింహారెడ్డి రీ రిలీజ్ ఇన్ని థియేటర్స్ లో ఏంటి సామి…అరాచకం!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచి రికార్డులను చెల్లాచెదురు చేసిన సినిమాలలో సమర సింహా రెడ్డి(Samara Simha Reddy) సినిమా ముందు నిలుస్తుంది…ఫాక్షన్ బ్యాగ్ డ్రాప్ లో వచ్చి బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసిన ఈ సినిమా…

రిలీజ్ అయ్యి రీసెంట్ గా 25 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్భంగా భారీ ఎత్తున రీ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు… మార్చ్ 2 న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అలాగే కర్ణాటకలో భారీ లెవల్ లో రీ రిలీజ్ కానుండగా థియేటర్స్ కౌంట్ కూడా సాలిడ్ గా ఉండబోతుంది… ఒక్క నైజాంలోనే సినిమాను ఇప్పుడు ఆల్ మోస్ట్…

100 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతూ ఉండగా టోటల్ ఆంధ్రలో ఆల్ మోస్ట్ 250 వరకు స్క్రీన్స్ లో సినిమా రీ రిలీజ్ కానుంది. దాంతో తెలుగు రాష్ట్రాలలోనే సినిమా మొత్తం మీద 350 వరకు స్క్రీన్స్ లో గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతూ ఉండగా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమా ఇప్పుడు…

మరో 50 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది. దాంతో ఓవరాల్ గా సినిమా 400 వరకు స్క్రీన్స్ లో గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతుంది. మేకర్స్ ఈ సినిమా కచ్చితంగా రీ రిలీజ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్న నమ్మకంతో ఉన్నారు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here