Home న్యూస్ బజార్ రౌడీ మూవీ రివ్యూ…హిట్టా-ఫట్టా!!

బజార్ రౌడీ మూవీ రివ్యూ…హిట్టా-ఫట్టా!!

0

హృదయ కాలేయం సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకుని టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూర్నేష్ బాబు తర్వాత మరో హిట్ ని కొబ్బరి మట్ట సినిమాతో అందుకున్నాడు. మధ్యలో అడపాదడపా చిన్నా చితకా సినిమాలు చేసినా ఆడియన్స్ లో ఏమాత్రం ఇంప్రెషన్ ను సొంతం చేసుకోలేదు. ఇలాంటి టైం లో రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు బజార్ రౌడీ అనే సినిమా తో వచ్చిన సంపూ ఎంతవరకు ఆకట్టుకున్నాడో తెలుసుకుందాం పదండీ…

చిన్నప్పటి నుండి కష్టాల్లో పెరిగే హీరోని ఇబ్బందులు వచ్చిన ప్రతీ సారి హీరో ఫాదర్ కొడతాడు. ఇదంతా తట్టుకోలేక హీరో ఇంట్లో నుండి పారిపోతాడు.. తర్వాత తన ఆస్తిని కాజేయాలని చూసిన తన అంకుల్స్ కి బుద్ది చెప్పడం కోసం మారు వేషంలో ఇంట్లో అడుగు పెడతాడు…

తర్వాత ఏమయింది అన్నది సినిమా కథ పాయింట్. ఫక్తు తెలుగు కమర్షియల్ మూవీ ఎలా ఉంటుందో ఈ సినిమా అలానే ఉంటుంది, కానీ సంపూ కామెడీ చేస్తాడు అనుకుంటే సీరియస్ గా స్పూఫ్స్ చేస్తాడు కానీ అవి జనాలకు ఏమాత్రం నవ్వుని అయితే తెప్పించలేదు అని చెప్పాలి..

ఇది వరకు తను చేసిన సినిమాలతో పోల్చితే అసలు ఏమాత్రం కామెడీ లేని సినిమా ఇది… సంపూ సినిమా అంటేనే ఎంతోకొంత స్పూఫ్స్ తో కామెడీ చేస్తాడు అనుకుంటే ఓ టాప్ స్టార్ మూవీ లాగా ఫైట్స్ కమర్షియల్ సీన్స్ తో సరిపెట్టడం ఆడియన్స్ కి బోర్ కొట్టిస్తుంది. హీరోయిన్స్ గురించి చెప్పడానికి ఏమి లేదు, సంగీతం యావరేజ్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ లౌడ్ గా ఉంటుంది.

ఫస్టాఫ్ కొంచం పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ సహనానికి పరీక్ష పెడుతుంది. కొబ్బరి మట్ట తర్వాత సంపూ మరోసారి ఆకట్టుకుంటాడేమో అనుకున్నా నిరాశ పరిచాడు అని చెప్పాలి. అయినా సంపూ కోసం చూడాలి అనిపిస్తే చాలా ఓపికతో సినిమాను పూర్తీ చేయాల్సి వస్తుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here