బాక్స్ ఆఫీస్ దగ్గర మన దగ్గర బాగా పాపులర్ అయిన రీ రిలీజ్ ల ట్రెండ్ ఇప్పుడు మెల్లిగా బాలీవుడ్ కి పాకింది…రీసెంట్ టైంలో అక్కడ రీ రిలీజ్ ల ట్రెండ్ సాలిడ్ గా సాగుతూ ఒకప్పుడు రిలీజ్ అయ్యి మంచి సినిమా అన్న పేరు తెచ్చుకున్న సినిమాలు ఇప్పుడు కుమ్మేస్తున్నాయి. తుంబాద్, యే జవానీ హై దివానీ, రాక్ స్టార్ ఇలా చాలా సినిమాలే…
రీసెంట్ టైంలో హిందీలో రిలీజ్ అయ్యి కుమ్మేశాయి…ఇప్పుడు ఈ సినిమాలను మించిన భీభత్సం సృష్టిస్తూ రిలీజ్ అయినప్పుడు డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు రీ రిలీజ్ లో ఊహకందని టికెట్ సేల్స్ అండ్ కలెక్షన్స్ తో కుమ్మేస్తుంది ఓ ఫ్లాఫ్ మూవీ…
తెలుగు లో చిన్న చిన్న రోల్స్ చేసిన హర్షవర్దన్ రానే హీరో గా హిందీలో చేసిన సనం తేరీ కసం(Sanam Teri Kasam) మూవీ 9 ఏళ్ల క్రితం రిలీజ్ అవ్వగా, అప్పుడు ఆడియన్స్ అనుకున్న రేంజ్ లో ఆదరించకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…
తర్వాత టైంలో యూత్ ఆడియన్స్ కి డిజిటల్ లో, యూట్యూబ్ లో బాగా కనెక్ట్ అయ్యింది. కాగా ఇప్పుడు ఈ సినిమాను రీసెంట్ గా రీ రిలీజ్ చేయగా, సాలిడ్ బుకింగ్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా కొత్త సినిమాలకు వచ్చే రేంజ్ లో టికెట్ సేల్స్ ను, కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది.
ఈ సినిమా టికెట్ సేల్స్ లో కార్పోరేట్ బుకింగ్స్ కూడా జరిగాయి అని అంటున్నా కూడా చాలా వరకు షోలు కూడా మంచి ఆక్యుపెన్సీతోనే రన్ అవ్వగా ఓవరాల్ గా ప్రీ బుకింగ్స్ రీ రిలీజ్ మొదటి రోజు టికెట్ సేల్స్ తో కలిపి సినిమా కి ఏకంగా 285K టికెట్ సేల్స్ జరిగాయి…ఇది మామూలు విషయం కాదు…
టికెట్ రేట్స్ తక్కువే అయినా కూడా ఈ రేంజ్ బుకింగ్స్ ఒక డిసాస్టర్ మూవీ కి జరగడం అన్నది మాములు విషయం కాదు. ఇక కలెక్షన్స్ పరంగా మొదటి రోజు అవలీలగా 4.5-5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుందని అంచనా…ఈ రేంజ్ లో కలెక్షన్స్ రీ రిలీజ్ లో ఒక ఫ్లాఫ్ మూవీ కి సొంతం అవ్వడం మాములు విషయం కాదు, ఇక ఈ వీకెండ్ మొత్తం సినిమా సాలిడ్ జోరు చూపించవచ్చు అని అంటూ ఉండటం విశేషం….