Home న్యూస్ సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రివ్యూ…బ్లాక్ బస్టర్ పక్కా!!

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రివ్యూ…బ్లాక్ బస్టర్ పక్కా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన సంక్రాంతికివస్తున్నాం(Sankranthiki Vasthunam Movie)సినిమా సంక్రాంతికి గ్రాంగ్ గా రిలీజ్ కాబోతూ ఉండగా, ఓవరాల్ గా సంక్రాంతి సీజన్ లో లేట్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సాంగ్స్ ఆల్ రెడీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సినిమా మీద ఓవరాల్ గా…

అంచనాలు సాలిడ్ గానే పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచడానికి సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి అని చెప్పాలి ఇప్పుడు…

ఓవరాల్ గా ట్రైలర్ లో స్టోరీ పాయింట్ నార్మల్ గానే అనిపించినప్పటికీ వెంకటేష్ కి ఉన్న ఫ్యామిలీ ఫాలోయింగ్ క్రేజ్ అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి సక్సెస్ ట్రాక్ తో పాటు వీళ్ళ కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 ల సక్సెస్ ల తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో ఈ సినిమా…

ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ ఓ రేంజ్ లో థియేటర్స్ కి ఎగబడటం ఖాయమని చెప్పాలి. ఇక ట్రైలర్ లో సినిమా కథ ఎలా ఉండబోతుందో చెప్పేశారు…. ఎక్స్ పోలిస్ ఆఫీసర్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక సీక్రెట్ మిషన్ కోసం తిరిగి రావాల్సి రాగా…

ఆ భాద్యతని హీరో ఎక్స్ లవర్ కి అప్పగిస్తారు…ఇటు ఫ్యామిలీతో హ్యాప్పీ గా ఉంటున్న హీరో లైఫ్ తర్వాత ఎలా టర్న్ తీసుకుంది అన్నది స్టోరీ పాయింట్ గా అనిపిస్తూ ఉండగా ట్రైలర్ ఓవరాల్ గా కుమ్మేసింది. వెంకటేష్ ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకోగా తన డైలాగ్స్ మ్యానరిజమ్స్ కూడా ఆకట్టుకున్నాయి…

బ్యాగ్రౌండ్ స్కోర్ కొంచం వీక్ గా అనిపించినా ట్రైలర్ క్వాలిటీ, డైలాగ్ లు అన్నీ కూడా కామిక్ టచ్ తో మెప్పించడంతో సినిమా చూస్తున్న టైంలో ఆడియన్స్ మరింత ఎంజాయ్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా అనిల్ రావిపూడి మరోసారి ఔట్ అండ్ ఔట్…

ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడని ట్రైలర్ చూస్తె క్లియర్ అవుతుంది. మొత్తం మీద ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు పెరిగిపోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా ఓ రేంజ్ లో కుమ్మేయడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here