Home న్యూస్ సరిలేరు నీకెవ్వరు Vs అల వైకుంటపురంలో ఓవర్సీస్ బిజినెస్ డీటైల్స్!!

సరిలేరు నీకెవ్వరు Vs అల వైకుంటపురంలో ఓవర్సీస్ బిజినెస్ డీటైల్స్!!

0

     టాలీవుడ్ 2020 సంక్రాంతి సీజన్ కి సమయం దగ్గర పడుతుంది… మరో 3 నెలల్లో టాలీవుడ్ క్రేజీ మూవీస్ సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి. వాటి లో ముందుగా మహేష్ బాబు అనిల్ రావి పూడి ల సరిలేరు నీకెవ్వరు సినిమా ముందుగా కన్ఫాం అవ్వగా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల అల వైకుంటపురంలో కూడా సంక్రాంతి కి రిలీజ్ కాబోతుందని కన్ఫాం అయింది. ఇక ఈ రెండు సినిమాల టోటల్ ఓవర్సీస్ బిజినెస్…

రిలీజ్ కి 3 నెలల ముందే ఆల్ మోస్ట్ కంప్లీట్ అయింది. కాగా ఈ రెండు సినిమాల ఓవర్సీస్ బిజినెస్ ని గమనిస్తే… ముందుగా సరిలేరు నీకెవ్వరు సినిమా టోటల్ ఓవర్సీస్ బిజినెస్ 14 కోట్లు పలినింది. అందులో అమెరికాలో సినిమా బిజినెస్ సుమారు గా 11.5 కోట్ల రేంజ్ బిజినెస్ ని సొంతం చేసుకుంది.

ఇక అల్లు అర్జున్ అల వైకుంటపురం లో సినిమా టోటల్ ఓవర్సీస్ బిజినెస్ మొత్తం మీద 9.8 కోట్ల రేంజ్ లో పలికింది. అందులో అమెరికాలో సినిమా బిజినెస్ మొత్తం మీద 8.3 కోట్ల రేంజ్ లో పలికినట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఈ 2 రెండు సినిమాల బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ ని పరిశీలిస్తే…

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా టోటల్ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 3.5 మిలియన్ నుండి 3.7 మిలియన్ రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని వసూల్ చేయాల్సి ఉంటుంది. ఇక అమెరికాలో అయితే 2.8 మిలియన్ కి పైగా గ్రాస్ ని వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.

ఇక అల్లు అర్జున్ అల వైకుంటపురంలో సినిమా టోటల్ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 2.5 మిలియన్ నుండి 2.7 మిలియన్ రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని వసూల్ చేయాల్సి ఉంటుంది. ఇక అమెరికాలో అయితే 2.1 మిలియన్ కి పైగా గ్రాస్ ని వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇవీ మొత్తం మీద 2020 తెలుగు సంక్రాంతి బిగ్ మూవీస్ ఓవర్సీస్ బిజినెస్ అండ్ టార్గెట్ డీటైల్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here