బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా, ఓవర్సీస్ లో మాత్రం ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకుంది. వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన కలెక్షన్స్ కొంచం అండర్ పెర్ఫార్మ్ చేయగా…
లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటంతో సినిమా కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉంది. మొత్తం మీద రెండో రోజు మొదటి రోజుతో కంపేర్ చేస్తే ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 40-45% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. శుక్రవారం అయినా కూడా వర్కింగ్ డే నే అవ్వడంతో డ్రాప్స్ అనేవి కామన్ అనే చెప్పాలి.
మొత్తం మీద ఈవినింగ్ షోలకు సినిమా గ్రోత్ చూపించే అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 2.5-3 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి ఇప్పుడు, అన్ని చోట్ల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుండి…
షో షో కి కలెక్షన్స్ లో గ్రోత్ ఉంటే 3 కోట్లకు పైగా షేర్ ని అందుకోవచ్చు. కానీ సినిమా ఇక్కడ కన్నా కూడా ఓవర్సీస్ మార్కెట్ లోనే బెటర్ గా హోల్డ్ ని చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుండి జోరు పెంచితే అనుకున్న రేంజ్ కలెక్షన్స్ కన్నా కూడా…
ఇంకా బెటర్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు కానీ సినిమాకి వచ్చిన టాక్ కి ఇంకా బెటర్ గా గ్రోత్ ని సినిమా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు ఎండ్ అయ్యే టైంకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపించి అంచనాలను మించుతుందో లేక ఇదే రేంజ్ లో వసూళ్ళని అందుకుంటుందో చూడాలి.