Home న్యూస్ సవ్యసాచి టీసర్ రివ్యూ…50 కోట్ల బొమ్మ బాస్

సవ్యసాచి టీసర్ రివ్యూ…50 కోట్ల బొమ్మ బాస్

0

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ సవ్యసాచి..నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఉన్న అంచనాలు మామూలుగా లేవు.

భారీ అంచనాల నడుమ ఇప్పుడు రిలీజ్ అయిన అఫీషియల్ టీసర్ సినిమా పై ఉన్న క్రేజ్ ని మరింతగా పెంచేసింది…ఒక మనిషికి రెండు చేతుల్లో సమానమైన బలం ఉంటే ఎలా ఉంటుంది అన్న డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది.

నాగ చైతన్య పలికిన “మాములుగా ఒక తల్లి రక్తం పంచుకొని పుడితే అన్నదమ్ములు అంటారు.. అదే ఒకే రక్తం… ఒకే శరీరం పంచుకొని పుడితే దాన్ని అద్భుతం అంటారు” అన్న డైలాగ్ టీసర్ కి హైలెట్ గా నిలవగా..టీసర్ ని చూస్తుంటే నాగ చైతన్య ఈ సారి కచ్చితంగా 50 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది..మీరు టీసర్ చూసి ఎలా ఉందో చెప్పండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here