Home న్యూస్ సవ్యసాచి డే 3 ఓపెనింగ్స్…2 పక్కా!

సవ్యసాచి డే 3 ఓపెనింగ్స్…2 పక్కా!

0

  యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య చందు మొండేటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ సవ్యసాచి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో టోటల్ గా 6.5 కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా సినిమా బిజినెస్ ని అందుకోవడానికి మరింతగా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా మూడో రోజు ఆదివారం అవ్వడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో బాగానే ఓపెన్ అయింది.

అన్నీ చోట్లా రెండో రోజు తో పోల్చితే మూడో రోజు ఓపెనింగ్స్ 5-8% పెరిగాయి. దాంతో ఈవినింగ్ అండ్ నైట్ షోల లో కూడా సినిమా జోరు కొనసాగించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న జోరు చూస్తుంటే సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర….

2 కోట్లకు పైగానే షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఒకవేళ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ జోరు బాగా పెరిగితే ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా రోజు ముగిసే సమయానికి ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here