బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మొదటి వారం తర్వాత కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ ను దాటేసి భారీ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుండగా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో…
కొద్దిగా నష్టాలు వచ్చేలా ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద టోటల్ బిజినెస్ పై కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు. 10 రోజులు పూర్తీ అయ్యే టైం కి ఆల్ మోస్ట్ 12 కోట్ల వరకు షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకున్న ఈ సినిమా…
హిట్ నుండి సూపర్ హిట్ గా నిలిచింది, టాలీవుడ్ నుండే కాకుండా ఇండియా మొత్తం మీద కూడా థియేటర్స్ అన్నీ రీ ఓపెన్ అయ్యాక రిలీజ్ అయిన సినిమాలలో బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకున్న మొట్ట మొదటి సినిమాగా రికార్డ్ సృష్టించగా సినిమా 10 రోజుల్లో…
ఆల్ మోస్ట్ 20.2 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ని 50% లిమిటేషన్స్ తోనే సొంతం చేసుకోవడం తో ఇతర ఇండస్ట్రీలు కూడా షాక్ అవుతున్నాయి. ఇలాంటి కలెక్షన్స్ ని నార్మల్ రిలీజ్ తోనే సొంతం చేసుకోవడంతో వాళ్ళ దగ్గర ఇలాంటి రెస్పాన్స్ వస్తుందో లేదో అన్న డౌట్ లో ఉన్నారు. పాండమిక్ తర్వాత ఇండియా లో రిలీజ్ అయిన సినిమాల్లో క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాగా సోలో బ్రతుకే సో బెటర్…
సినిమా సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది… ఈ సినిమా ఇచ్చిన ఊపు తోనే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో కూడా సినిమాల రిలీజ్ పెరుగుతూ ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి రేసులో మరిన్ని సినిమాలు జోరు చూపడానికి సిద్దం అవుతున్నాయి. అప్పటి వరకు కూడా సోలో బ్రతుకే సో బెటర్ జోరు కొనసాగేలానే కనిపిస్తుంది.