Home న్యూస్ వరల్డ్ ఫేమస్ లవర్ డే 2 కలెక్షన్స్….దెబ్బపడింది సామి!!

వరల్డ్ ఫేమస్ లవర్ డే 2 కలెక్షన్స్….దెబ్బపడింది సామి!!

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు భారీ షాక్ లే ఇచ్చింది, సినిమా వీకెండ్ లోనే ఉన్నా కానీ మౌత్ టాక్ నెగటివ్ గా మారడం తో అది బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఇంపాక్ట్ నే చూపుతూ సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపుతుంది, సినిమా రెండో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఫస్ట్ డే తో పోల్చితే…

World Famous Lover 2nd Day Collections

40 టు 45% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకోగా మాస్ సెంటర్స్ మరింత భారీగా డ్రాప్ అయ్యాయి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి కేవలం 5% లోపే గ్రోత్ ని సొంతం చేసుకున్న సినిమా మాస్ సెంటర్స్ లో గ్రోత్ సాధించలేదు.

World Famous Lover First Day Collections...Sensational Day 1

దాంతో ఇప్పుడు రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 2.2 కోట్ల రేంజ్ నుండి 2.5 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. అది కూడా పూర్తీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి చెప్పగలం. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా…

World Famous Lover First Day Box Office Openings!

రెండో రోజు 2.8 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవచ్చు, బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఆ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఈ కలెక్షన్స్ ఏమాత్రం సరిపోవని చెప్పాలి, దాంతో రెండో రోజే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ దెబ్బ పడింది..

ఇక ఆదివారం రోజున సినిమా మొదటి రోజు కన్నా భారీ గ్రోత్ ని చూపితే తప్పితే రేసులో నిలిచే అవకాశం లేదనే చెప్పాలి. ఇతర భాషల్లో కూడా కలెక్షన్స్ రెండో రోజు భారీ గా తగ్గాయి. మరి అఫీషియల్ గా 2 రోజులకు గాను సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

World Famous Lover First Day Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here