Home గాసిప్స్ ఇంకా రిలీజే కాని సినిమా…రీమేక్ రేటు ఆఫర్ తెలిస్తే షాక్!!

ఇంకా రిలీజే కాని సినిమా…రీమేక్ రేటు ఆఫర్ తెలిస్తే షాక్!!

0

టాలెంట్ ఉండీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్ కోసం ఏళ్ళు ఎదురు చూసిన హీరోల్లో బాలీవుడ్ హీరో షాయిద్ కపూర్ కూడా ఒకరు. ఎన్నో ఏళ్ళు ఇండస్ట్రీ లో ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ టర్నింగ్ పాయింట్ హిట్ ని మాత్రం లాస్ట్ ఇయర్ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తో సొంతం చేసుకున్నాడు. ఆ ఒక్క సినిమా తో మళ్ళీ ఫుల్ ఎనర్జీ తో దూసుకు పోతున్నాడు.

ఈ టైం లో నే ఓన్ కథ ల కన్నా కూడా రీమేక్స్ నే ఎక్కువగా నమ్ముకుంటున్న ఈ హీరో అర్జున్ రెడ్డి రీమేక్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు నాని నటించిన వన్ ఆఫ్ బెస్ట్ మూవీ జెర్సీ ని సుమారు 3.5 కోట్ల రేంజ్ రేటు చెల్లించి రీమేక్ రైట్స్ తీసుకుని…

హిందీ లో అదే పేరు తో ఇప్పుడు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా తర్వాత కూడా మరో రీమేక్ నే సిద్ధం చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ వలన రిలీజ్ ఆగిపోయిన కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన బైలింగువల్ మూవీ ఆకాశమే హద్దుగా ని…

హిందీ లో రీమేక్ చేయబోతున్నట్లు రీసెంట్ గా వార్తలు రాగా వాటిని షాయిద్ కపూర్ నుండి ఎలాంటి ఖండించాదాలు జరగలేదు. దాంతో ఇది ఆల్ మోస్ట్ కన్ఫాం అయినట్లే అని చెబుతుండగా ఇప్పుడు మరో న్యూస్ కూడా చక్కర్లు కొడుతుంది. ఆ న్యూస్ ప్రకారం ఇంకా రిలీజ్ కూడా కానీ ఈ సినిమా కి రీమేక్ రైట్స్ కింద ఏకంగా…

6.5 కోట్ల రేటు ఆఫర్ చేశారని అంటున్నారు కానీ ఇందులో నిజానిజాలు ఇంకా తేలాల్సి ఉన్నాయి. నిజం అయితే మట్టుకుని హిందీ రీమేక్ రైట్స్ లో బిగ్గెస్ట్ రేటు దక్కించుకున్న సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలవనుంది. ఇక్కడ విశేషం ఏంటి అంటే ఇంకా రిలీజ్ కూడా కాని ఈ సినిమా కి ఈ రేటు కొద్దిగా షాకింగ్ గానే ఉందని చెప్పాలి. మరి ఎంతవరకు నిజం అవుతుందో లేదో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here