Home న్యూస్ 6 ఏళ్ళుగా హిట్ లేదు, నంబర్ 1 డైరెక్టర్ తో అనుకుంటే…320 కోట్ల సినిమా డైరెక్టర్...

6 ఏళ్ళుగా హిట్ లేదు, నంబర్ 1 డైరెక్టర్ తో అనుకుంటే…320 కోట్ల సినిమా డైరెక్టర్ తో!

0

దశాబ్దం పాటు బాలీవుడ్ ని ఎవ్వరూ అందులేని లెవల్ లో ఏలిన హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్.. బాలీవుడ్ టాప్ హీరోలు ఒకటి రెండు హిట్లు కొట్టడానికే కష్టపడుతున్న టైం లో ప్రతీ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ ని సొంతం చేసుకుంటూ 2008 వరకు బాలీవుడ్ ని ఏక చక్రాదిపత్యంగా ఏలిన షారుఖ్ తర్వాత ఫాం కోల్పోయాడు. ఓమ్ శాంతి ఓం బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ అలాంటి బ్లాక్ బస్టర్ కోసం…

2013 వరకు ఎదురు చూసి చెన్నై ఎక్స్ ప్రెస్ తో మళ్ళీ రికార్డులు సృష్టించి తర్వాత ఏడాది హ్యాప్పీ న్యూ ఇయర్ డివైడ్ టాక్ తోనూ 200 కోట్లు కొల్లగొట్టినా తర్వాత నుండి ఒక్కటంటే ఒక్క విజయాన్ని కూడా అందుకోలేక పోయిన షారుఖ్ చేయని ప్రయత్నం లేదు.

ప్రయోగం లేదనే చెప్పాలి, కానీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ మాత్రం సొంతం అవ్వలేదు, ఇలాంటి టైం లో భారీ బడ్జెట్ తో కమర్షియల్ హంగులతో చేసిన బిగ్గెస్ట్ ప్రయోగం జీరో కూడా డిసాస్టర్ అవ్వడం తో రెండేళ్ళుగా సినిమా మొదలు పెట్టని షారుఖ్ ఎట్టకేలకు తన కంబ్యాక్ ని బాలీవుడ్ నంబర్ 1…

డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి తో చేయబోతున్నాడు అని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవ్వగా ఇప్పుడు ఆ సినిమా కన్నా ముందే రీసెంట్ గా వార్ సినిమా తో 320 కోట్లు కొల్లగొట్టిన వార్ సినిమా డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో కన్ఫాం అయ్యింది, ఈ సినిమా కు “పటాన్” అనే టైటిల్ ని కూడా కన్ఫాం చేయగా… కీలక రోల్ లో మరో హీరో… జాన్ అబ్రహం నటించబోతున్నాడు,

ఈ సినిమా కొంచం షారుఖ్ ఇది వరకే నటించిన రేయిస్ పోలికలు ఉంటాయని టాక్ ఉండగా ఈ నెలలో అఫీషియల్ గా ఈ సినిమా అనౌన్స్ మెంట్ ఉండబోతుందని సమాచారం. కానీ ఫ్యాన్స్ మాత్రం ముందు రాజ్ కుమార్ హిరాణి సినిమా వస్తే బాగుండేదని బావిస్తున్నా స్క్రిప్ట్ చేంజెస్ అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ వలన ఆ సినిమా డిలే అవుతుండటంతో ఈ సినిమా ను ముందు స్టార్ట్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాతో షారుఖ్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here