కెరీర్ మొదట్లో విలక్షణ రోల్స్ తో మెప్పించిన శర్వానంద్ తర్వాత రన్ రాజా రన్ సినిమా నుండి కమర్షియల్ మూవీస్ తో తనకంటూ మంచి మార్కెట్ ని ఏర్పరచుకున్నాడు… ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి మరియు మహానుభావుడు లాంటి సినిమాలతో తన క్రేజ్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది, కానీ తర్వాతే సరైన సినిమాలు పడక మార్కెట్ కూడా పూర్తిగా డల్ గా మారి షాక్ ఇచ్చింది శర్వానంద్ కి…
మూడేళ్ళ నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర మరో హిట్ కి దూరం అయిన శర్వానంద్ ఈ ఇయర్ జాను తో మరో ఫ్లాఫ్ ని సొంతం చేసుకోగా రీసెంట్ గా చేస్తున్న శ్రీకారం సినిమా సమ్మర్ రేసులో నిలిచిన సినిమానే అయినా కానీ కరోనా వలన పోస్ట్ పోన్ అవ్వగా…
తర్వాత సైలెంట్ అయిన ఈ సినిమా రీసెంట్ గా ఒక్క సాంగ్ రిలీజ్ తో మళ్ళీ హైప్ ని సొంతం చేసుకుంది, సినిమా పై మళ్ళీ బజ్ మొదలు అవ్వగా సినిమా రిలీజ్ డేట్ ని ఎలాగూ అనౌన్స్ చేయక పోవడం తో OTT యాప్స్ ఆఫర్స్ ఇంప్రూవ్ చేశాయట.
రీసెంట్ గా సినిమా 12-13 కోట్ల రేంజ్ లో ఆఫర్స్ ని కోట్ చేయగా యూనిట్ ఆ ఆఫర్స్ ని పట్టించుకోలేదు, ఇక సాంగ్ తో బజ్ మళ్ళీ పెరగడంతో ఇప్పుడు 15 కోట్ల దాకా రేటు ని ఆఫర్ చేస్తున్నారని తెలుస్తుంది, 15 కోట్ల రేంజ్ డీల్ అంటే మంచి డీల్ అనే చెప్పాలి. ఆల్ మోస్ట్ కొంచం అటూ ఇటూగా…
శర్వానంద్ లాస్ట్ రెండు మూడు సినిమాల బిజినెస్ రేంజ్ కూడా ఇదే విధంగా జరిగింది కానీ మేకర్స్ సినిమాను అమ్మకానికి ఒప్పుకోవాలి అంటే మరింత రేటు పెరిగితే ఆలోచించే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి డిజిటల్ రిలీజ్ కోసం మరింత ఎక్కువ ఆఫర్లను ఈ సినిమా కోసం ఇస్తారో లేదో త్వరలో తేలనుంది.