2017 టైం లో కెరీర్ లో పీక్ టైం ని ఎంజాయ్ చేసిన యంగ్ హీరో శర్వానంద్ నటించిన తర్వాత సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాయి, రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు శ్రీకారం సినిమా తో వచ్చిన శర్వానంద్ ఈ సారి పాటలు మంచి హిట్ అవ్వడం అండ్ సినిమా కి పాజిటివ్ టాక్ కూడా రావడం తో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా తో కంబ్యాక్…
ఇవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు, కానీ సినిమా మాత్రం తొలిరోజు ఎలాగోలా కొద్దివరకు గ్రోత్ ని చూపెట్టినా కానీ తర్వాత మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపకుండా పరుగును కొనసాగించగా మొదటి వారం తర్వాత రెండో వారం లో రిలీజ్ అయిన కొత్త సినిమాల కోసం…
ఈ సినిమా థియేటర్స్ చాలా వరకు ఇచ్చేయడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత ఇంపాక్ట్ చూపింది, ఇలాంటి పరిస్థితి లో కూడా సినిమా టికెట్ హైక్స్ తగ్గించకపోవడం తో చిల్లర కలెక్షన్స్ ని రెండో వీకెండ్ లో సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద డిసాస్టర్ అవ్వడం ఖాయం అయ్యింది.
సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 2.84Cr
👉Ceeded: 1.65Cr
👉UA: 1.20Cr
👉East: 74L
👉West: 50L
👉Guntur: 99L
👉Krishna: 53L
👉Nellore: 32L
AP-TG Total:- 8.77CR (14.76Cr Gross~)
Ka+ROI – 28L( updated )
OS – 52L
Total World Wide: 9.57CR( 16.30CR~ Gross)
సినిమాను టోటల్ గా 17.1 కోట్లకు అమ్మగా సినిమా 17.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 11 రోజుల తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 7.93 కోట్ల షేర్ ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది, అది అసాధ్యం కాబట్టి మరో డిసాస్టర్ శర్వానంద్ ఖాతాలో పడటం ఖాయం అయ్యింది.