Home న్యూస్ మినిమమ్ బజ్ లేదు…పైగా ఈ టికెట్ రేట్లు ఏంటి సామి…బిజినెస్ లెక్క ఇదే!!

మినిమమ్ బజ్ లేదు…పైగా ఈ టికెట్ రేట్లు ఏంటి సామి…బిజినెస్ లెక్క ఇదే!!

0

శర్వానంద్ నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోవడం లేదు, 2017 లో శతమానం భవతి, మహానుభావుడు లాంటి సినిమాలతో సూపర్ ఫాం లో ఉన్న శర్వానంద్ తర్వాత చేసిన సినిమాలు ఏమి పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు, ఇలాంటి టైం లో జాను డిసాస్టర్ రిజల్ట్ తర్వాత శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్రీకారం బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఇప్పుడు మహా శివరాత్రి కానుకగా రిలీజ్ కి సిద్ధం అవుతుండగా రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేసినా కూడా పెద్దగా బజ్ ని క్రియేట్ చేయలేక పోయింది, ట్రైలర్ రెస్పాన్స్ కూడా సోసోగానే ఉండటం తో ఇక సినిమా మౌత్ టాక్ పైనే డిపెండ్ అవ్వగా బిజినెస్ మాత్రం సాలిడ్ గానే జరిగింది.

సినిమా కి నైజాం ఏరియాలో 5.7 కోట్ల బిజినెస్ జరగగా సీడెడ్ లో 2.4 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక టోటల్ ఆంద్రలో సినిమాకి 8 కోట్ల బిజినెస్ జరగగా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సినిమా కి 16.1 కోట్ల బిజినెస్ జరగగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా మరో…

కోటి వరకు బిజినెస్ ను సొంతం చేసుకుంది, దాంతో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా 17.1 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే సినిమా 17.5 కోట్లకు పైగా షేర్ ని మినిమమ్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక బజ్ పెద్దగా లేకున్నా కానీ సినిమాకి టికెట్ హైక్స్ భారీగా పెంచాబోతున్నారు అని సమాచారం..

సింగిల్ స్క్రీన్స్ లో 120 నుండి 150 వరకు, అలాగే మల్టీప్లెక్స్ లో 200 నుండి 250 వరకు టికెట్ హైక్స్ ఈ సినిమా ఉండబోతున్నయట… అసలే హిట్స్ లేవు, అందునా సినిమా పెద్దగా బజ్ క్రియేట్ చేయలేదు, బిజినెస్ ఎక్కువ జరిగింది, పోటిలో ఇతర సినిమాలు ఉన్నాయి. ఇలాంటి టైం లో ఈ టికెట్ హైక్స్ వలన సినిమా కి హెల్ప్ అవుతుందో లేక దెబ్బ పడుతుందో అనేది త్వరలోనే తెలుస్తుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here