Home గాసిప్స్ బడ్జెట్ మించకుండా చేసిన శర్వానంద్…మనం మూవీ బడ్జెట్ ఎంత అయిందో తెలుసా!!

బడ్జెట్ మించకుండా చేసిన శర్వానంద్…మనం మూవీ బడ్జెట్ ఎంత అయిందో తెలుసా!!

0

టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో ఒకప్పుడు స్టేబుల్ మార్కెట్ ను సొంతం చేసుకున్న వాళ్ళలో శర్వానంద్(Sharwanand) ఒకరు కాగా శర్వానంద్ లాస్ట్ మూవీ ఒకే ఒక జీవితం(Oke Oka Jeevitham Movie) తో హిట్ కొట్టినా కానీ అంతకన్నా ముందు మూవీస్ అన్నీ కూడా నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకున్నాయి…

ఓవరాల్ గా శర్వానంద్ లాస్ట్ 6-7 సినిమాలు అన్నీ కూడా బడ్జెట్ పరంగా అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కగా కొన్ని బడ్జెట్ వలన నిర్మాతలకు లాస్ లు రాగా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకున్నాయి. దాంతో ఎట్టి పరిస్థితులలో తన లేటెస్ట్ మూవీ…

మనమే(Manamey Movie) మూవీ మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా విషయంలో శర్వానంద్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. బడ్జెట్ పరంగా ఎట్టి పరిస్థితులలో కూడా లిమిట్ ను క్రాస్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారట…

టీం తో కలిసి 30 కోట్ల బడ్జెట్ మించకూడదు అని ఫిక్స్ అయిన శర్వానంద్ సినిమా ఎండ్ అయ్యే టైంకి బడ్జెట్ పరంగా 28.5 కోట్ల రేంజ్ బడ్జెట్ లో సినిమాను కంప్లీట్ అయ్యేలా చేశారట…ఇక ఇతర ఖర్చులతో కలిపి 30 కోట్ల లోపే బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం అయ్యిందని సమాచారం. 

ఓవర్సీస్ లో షూటింగ్ ఎక్కువగా జరిగినా కూడా బడ్జెట్ లోనే సినిమా పూర్తి అవ్వడం విశేషం కాగా రీసెంట్ టైంలో శర్వానంద్ కెరీర్ లో బడ్జెట్ పరంగా లిమిటెడ్ బడ్జెట్ లో కంప్లీట్ అయిన సినిమా ఇదేనని అంటున్నారు. ఇక ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో శర్వానంద్ కి ఎలాంటి రిజల్ట్ సొంతం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here