టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల్లో నటన పరంగా స్టార్ హీరోల కి ఏమాత్రం తీసి పోని నటన తో మెప్పించే యాక్టర్ శర్వానంద్… శర్వానంద్ కెరీర్ ని సైడ్ రోల్స్ తో మొదలు పెట్టి అంచలంచలుగా ఎదిరి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రామిసింగ్ హీరోగా మారాడు కానీ తర్వాత స్క్రిప్ట్ సెలెక్షన్ విషయం లో తప్పటడుగులు వేయడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ కి దూరం అయ్యాడు శర్వానంద్.
2017 టైం లో శతమానం భవతి సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టి ఇయర్ ఎండ్ లో మహానుభావుడు తో మరో సూపర్ హిట్ ని సొంతం చేసుకున్న శర్వానంద్ తర్వాత వరుస పెట్టి ఫ్లాఫ్స్ ని సొంతం చేసుకున్నాడు, పడి పడి లేచే మనసు, రణ రంగం, జాను….
ఇక ఈ ఇయర్ శ్రీకారం లాంటి సినిమాలు ఆడియన్స్ ఏమాత్రం ఆకట్టుకోలేదు, శ్రీకారం కి హిట్ టాక్ వచ్చినా జనాలు థియేటర్స్ కి రాలేదు. ఇన్ని ఫ్లాఫ్స్ పడుతున్నా కానీ శర్వానంద్ సినిమాలకు థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ లు బాగా జరుగుతాయి కాబట్టి రెమ్యునరేషన్ పరంగా ఎప్పుడూ డౌన్ అవ్వలేదు.
రీసెంట్ టైం లో వరుస ఫ్లాఫ్స్ పడ్డా కానీ ప్రస్తుతం శర్వానంద్ చేస్తున్న కొత్త సినిమా మహా సముద్రం సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ నే శర్వానంద్ సొంతం చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. ఇది వరకు ఒక్కో సినిమా 4-5 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకునే శర్వానంద్ ఈ మల్టీ స్టారర్ మూవీ కోసం 6 కోట్ల దాకా రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నాడని సమాచారం.
ఇక ఇదే సినిమాతో కంబ్యాక్ ఇస్తున్న లవర్ బాయ్ సిద్దార్థ్ కూడా 3 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ ని సొంతం చేసుకుంటున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ హిట్ కొట్టి 4 ఏళ్ళు అవుతున్నా తనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉండటానికి కారణం నటన పరంగా శర్వానంద్ రేంజ్ అని చెప్పొచ్చు. ఒక్క హిట్ పడితే కలెక్షన్స్ కూడా సాలిడ్ గా వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కంబ్యాక్ దక్కాలని మనం కోరుకుందాం.