ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు భారీగా చిన్న సినిమాలు రిలీజ్ అవ్వగా వాటిలో యూత్ ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉందీ అనిపించిన సినిమా సిద్దార్థ్ రాయ్(Siddharth Roy Review) ట్రైలర్ చూసిన తర్వాత అర్జున్ రెడ్డి సినిమాను పోలినట్లు అనిపించగా ఇక ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత సినిమా ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ విషయానికి వస్తే ఎలాంటి ఎమోషన్స్ లేని వ్యక్తి అయిన హీరో కి ఎమోషన్స్ ఎలా వచ్చాయి, దానికి రీజన్ ఏంటి…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది మిగిలిన కథ…. కొత్త హీరోనే అయినా దీపక్ సరోజ్ పెర్ఫార్మెన్స్ పరంగా ఫస్ట్ సినిమానే డిఫెరెంట్ కాన్సెప్ట్ ను ఎంచుకుని బాగా మెప్పించాడు… తన రోల్ వరకు ఆకట్టుకోగా…
హీరోయిన్ కూడా తన రోల్ వరకు బాగా పెర్ఫార్మ్ చేసింది. రథన్ సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉండగా కొన్ని సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే మెప్పించింది,… హీరో క్యారెక్టర్ మీద నడిచే సిద్దార్థ్ రాయ్ సినిమా కొన్ని సీన్స్ వరకు బాగానే ఆకట్టుకున్నా కూడా ఓవర్ గా ఆ క్యారెక్టర్ స్ట్రెచ్ చేయడంతో…
ఒక స్టేజ్ దాటాక సీన్స్ మరీ రిపీటివ్ గా అనిపిస్తూ డ్రాగ్ అవుతూ సహనానికి పరీక్ష పెట్టేలా చేస్తుంది…. దాంతో పాటు అర్జున్ రెడ్డి సినిమా చాలా సీన్స్ లో గుర్తు చేసేలా ఉండటంతో సినిమా నిరాశ పరిచే విధంగానే ఎక్కువగా అనిపించింది అని చెప్పాలి… మొత్తం మీద పెద్దగా అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ కి సినిమాలో…
కొన్ని సీన్స్ పరంగా పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా సినిమా మాత్రం నీరసంగానే సహనానికి పరీక్ష పెట్టేలా ఉందని చెప్పాలి…. ట్రైలర్ చూసి సిద్దార్థ్ రాయ్ కూడా అర్జున్ రెడ్డి రేంజ్ లో ఉంది అనుకుని వెళితే నిరాశనే ఎదురు అయ్యే అవకాశం ఉంటుంది, పెద్దగా అంచనాలు లేకుండా వెళితే కొన్ని సీన్స్ వరకు సినిమా పర్వాలేదు అనిపించవచ్చు… ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్….