Home గాసిప్స్ వరుణ్ తేజ్ తప్పించుకున్నాడు…వైష్ణవ్ తేజ్ కి దెబ్బ పడింది!!

వరుణ్ తేజ్ తప్పించుకున్నాడు…వైష్ణవ్ తేజ్ కి దెబ్బ పడింది!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకరితో అనుకున్న సినిమా మరొకరితో చేయడం అన్నది చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది…. ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని సినిమాల విషయంలో కూడా ముందు ఒకరితో సినిమా అనుకున్నా కూడా తర్వాత వేరే హీరోతో ఆ సినిమా చేయడం జరిగింది. అలాంటి సినిమాల్లో పంజా వైష్ణవ్ తేజ్(Panja Vaishnav Tej) నటించిన…

ఆదికేశవ(Aadikeshava) సినిమా కూడా ఒకటి అని చెప్పాలి… ఆ సినిమా చూసిన చాలా మంది రొటీన్ రొట్ట మూవీ అంటూ తీవ్రంగా విమర్శించినా కూడా యాక్షన్ పార్ట్ ను బాగానే ఎంజాయ్ చేశారు. వైష్ణవ్ తేజ్ లాంటి అప్ కమింగ్ హీరోకి కాకుండా ఓ మంచి మీడియం రేంజ్ హీరోకి ఆ సీన్స్ పడినా బాగా ఎలివేట్ అయ్యేవి అన్న టాక్ వినిపించింది.

నిజానికి ఆ సినిమానే ముందు వైష్ణవ్ తేజ్ దగ్గరకి వెళ్ళిన సినిమా కాదట…. ముందు ఈ సినిమాలో హీరోగా అనుకున్నది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) ని అని సమాచారం. సినిమా కథ మొత్తం విన్న తర్వాత మరీ ఈ రేంజ్ మాస్ అండ్ రొటీన్ కంటెంట్ చేయడానికి ఇష్టపడని వరుణ్ తేజ్ కథకి నో చెప్పారట.

దాంతో పాటు తను చేస్తున్న గాండీవధారి అర్జున మరియు ఆపరేషన్ వాలంటైన్ లాంటి సినిమాల షూటింగ్ ల వలన ఈ సినిమా కి డేట్స్ అడ్జస్ట్ అవ్వవని చెప్పి కథకి నో చెప్పగా అదే కథ వైష్ణవ్ తేజ్ దగ్గరకు వెళ్ళడం, మాస్ ఎలిమెంట్స్ నచ్చి కథని ఓకే చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ కథ…

ఏమాత్రం వర్కౌట్ అవ్వక భారీగా నిరాశ పరిచే రిజల్ట్ ను ఈ సినిమా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పట్టుమని వీకెండ్ వరకు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలవలేక పోయింది. అటు వరుణ్ తేజ్ కి కూడా బ్యాక్ టు బాక్ ఫ్లాఫ్స్ పడుతూ ఉండగా ఈ సినిమా చేసినా మరో ఫ్లాఫ్ పడేది కానీ ఆదికేశవ విషయంలో తను తప్పించుకున్నాడు కానీ వైష్ణవ్ తేజ్ కి గట్టి దెబ్బ పడింది…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here