బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ ల కాంబినేషన్ లో కవచం డిసాస్టర్ తర్వాత వస్తున్న సినిమా సీత, కాజల్ తేజ ల కాంబోలో లక్ష్మీ కళ్యాణం, నేనే రాజు నేనే మంత్రి తర్వాత వచ్చిన సినిమా సీత.. ఈ కాంబినేషన్లతో సీత సినిమా ప్రేక్షకుల మనసును ఎంతవరకు గెలుచుకుంది, తేజ హిట్ గీత మరోసారి దాటాడా లేదా, బెల్లంకొండ తొలి హిట్ కొట్టాడో లేదో తెలియాలి అంటే సినిమా రివ్యూ లోకి వెళ్ళాల్సిందే.
కథ: చిన్నప్పటి నుండి తనకి ఎదురైన సమస్యలతో డబ్బే ప్రధానం అని ఫిక్స్ అయిన సీత లైఫ్ లో ఎలాంటి ఎమోషన్స్ కి లోను కాకుండా డబ్బే ప్రధానం అనుకుంటూ జీవిస్తూ స్వార్ధంగా బతుకుతుంది, MLA సోనూసూద్ తో ఒక బిజినెస్ డీల్ జరగడం తో డబ్బు రికవరీ కి తన భావ అయిన బెల్లంకొండ ని వాడుకుంటుంది… కానీ సీత ని ప్రేమించే హీరో మనసుని హీరోయిన్ అర్ధం చేసుకుందా లేదా అన్నది అసలు కథ.
నటీనటులు: బెల్లంకొండ ఎప్పటి లానే ఎదో నటించాలి అన్నట్లు నటించాడు, సోనూ సూద్ విలనిజం ఆకట్టుకుంటుంది, మిగిలిన నటీనటులు తమ పాత్ర మేరకు ఆకట్టుకోగా సినిమా మొత్తం వన్ వుమన్ షో గా కాజల్ నట విశ్వరూపం చూపించింది. క్యారెక్టర్ లో ఉన్న అన్ని షేడ్స్ ని తన నటనతో మేస్మరిజ్ అయ్యేలా చేసింది.
విశ్లేషణ: సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ జస్ట్ యావరేజ్ గా అనిపిస్తుంది, ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది, సినిమా లో చాలా సీన్స్ బోర్ కొట్టించేలా ఉన్నాయి, ల్యాగింగ్ చాలా ఎక్కువ అయింది, స్క్రీన్ ప్లే కూడా చాలా వీగ్ గా ఉంటుంది, డైరెక్టర్ గా తేజ నేనే రాజు నేనే మంత్రి మ్యాజిక్ ని రిపీట్ చేయలేక పోయాడు.
ప్లస్ పాయింట్స్
*కాజల్ పెర్ఫార్మెన్స్
*సోనూ సూద్ విలనిజం
ఇక మైనస్ పాయింట్స్
*కథ
*సంగీతం
*డైరెక్షన్
*బెల్లంకొండ శ్రీనివాస్ మిస్ ఫిట్
*వీక్ క్లైమాక్స్….. ఇలా చెప్పుకుంటూ పొతే సినిమా లో చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. తేజ సినిమాలో మరో వీక్ స్టోరీ లైన్ అండ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన సినిమా సీత. కాజల్ ఎంతలా సినిమా ని నిలబెట్టే ప్రయత్నం చేసినా సరైన సపోర్ట్ దొరకలేదు.
దాంతో సినిమా ఫైనల్ గా ప్రేక్షకుల మనసుని గెలుచుకోలేక పోయింది, సినిమా మా రేటింగ్ 2.5 స్టార్స్…. కాజల్ కోసం ఒకసారి చూడొచ్చు… లెంత్ తగ్గించి స్క్రీన్ ప్లే మరింత పకడ్బందీగా రాసుకుని ఉంటే రిజల్ట్ కొంచం బెటర్ గా ఉండేది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.