Home న్యూస్ చరిత్ర చింపేసిన సూపర్ స్టార్…2 సార్లు 90 కోట్లు!!

చరిత్ర చింపేసిన సూపర్ స్టార్…2 సార్లు 90 కోట్లు!!

521
0

  సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ చరిత్ర లో సరికొత్త చరిత్ర సృష్టించాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర మహర్షి సినిమా తొలి రోజు సాధించిన టాక్ కి వస్తున్న కలెక్షన్స్ కి ఏమాత్రం సంబంధం లేదనే చెప్పాలి, సూపర్ స్టార్ పేరుకున్న పవర్ ఏంటో చూపుతూ సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ కెరీర్ బెస్ట్ నంబర్స్ ని నమోదు చేసే రేంజ్ లో 2 వారాల్లో రికార్డుల దుమ్ము దుమారం చేసింది.

ఇక ఈ సినిమా 2 వారల కే 90 కోట్లకు పైగా షేర్ ని అందుకుని మరో సంచలనం సృష్టించగా టాలీవుడ్ చరిత్రలో 2 సార్లు 90 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డ్ సృష్టించాడు. ఇది వరకు భరత్ అనే నేను సినిమా కూడా 90 కోట్ల మార్క్ ని అందుకున్న విషయం తెలిసిందే.

నిర్మాతలు అఫీషియల్ కలెక్షన్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి ట్రేడ్ లెక్కల్లో 100 కోట్ల మార్క్ ని అందుకున్న భరత్ అనే నేను తర్వాత ఇప్పుడు మహర్షి తో 90 కోట్లు అందుకున్న మహేష్ బాబు, టాలీవుడ్ హీరోల్లో బాహుబలి సిరిస్ ని పక్కకు పెడితే 90 కోట్లు 2 సార్లు అది కూడా వరుసగా అందుకున్న ఒకే ఒక్క హీరోగా చరిత్ర సృష్టించాడు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!