Home న్యూస్ స్కై లాబ్ మూవీ రివ్యూ…హిట్టా-ఫట్టా!

స్కై లాబ్ మూవీ రివ్యూ…హిట్టా-ఫట్టా!

0

పోస్టర్ లు, టీసర్ అండ్ ట్రైలర్ తో మంచి ఆసక్తిని క్రియేట్ చేసిన సత్యదేవ్, నిత్యా మీనన్ మరియు రాహుల్ రామాక్రిష్ణల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ స్కై లాబ్ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ.. ముందుగా కథ పాయింట్ కి వస్తే… పెళ్లి చేసుకోమని అడిగిన తండ్రికి రచయితగా ఫేమస్ అయ్యాకే చేసుకుంటానని చెప్పే నిత్యమీనన్….

సిటీలో లైసెన్స్ కాన్సిల్ అవ్వడంతో ఊర్లో క్లినిక్ నడుపుకునే సత్యదేవ్, ఇక ఒకప్పుడు ధనవంతులు అయినా ఇప్పుడు అప్పుల పాలయిన రాహుల్ రామకృష్ణ ఇలా అందరూ కరీంనగర్ లో ఓ ఊర్లో ఉంటారు… నాసా ప్రయోగించిన ‘స్కైలాబ్’ అనే భారీ ఉపగ్రహం విఫలమై.. భూమి మీద వివిధ దేశాల్లో ఇండియాలో కూడా పడబోతుంది అని…

తెలిసిన తర్వాత వీళ్ళ లైఫ్స్ ఎలా మారాయి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఈ ఉపద్రవం నుండి తప్పించుకోవడానికి ఏం చేశారు. అసలు తర్వాత ఏమయింది అన్నది మిగిలిన కథ… ఇప్పుడున్న యువత కి అప్పట్లో యుగాంతం టాపిక్ ఎంత ఫేమస్సో 1970 టైం లో స్కైలాబ్ టాపిక్ అంత ఫేమస్…

అలాంటి టాపిక్ ని ఎంచుకుని పాత్రల పరిచయం వరకు ఆకట్టుకున్న ఈ స్కై లాబ్ సినిమా తర్వాత ట్రాక్ తప్పి చాలా స్లో నరేషన్ తో నత్తనడకన సాగుతూ ఓ ఎంటర్ టైనర్ చూస్తాం అనుకుంటే ఓ ఆర్ట్ మూవీ చూస్తున్న ఫీలింగ్ ని కలిగిస్తూ చాలా నెమ్మదిగా సాగుతూ చాలా చోట్ల బోర్ కొట్టిస్తుంది. కానీ అక్కడక్కడా కొన్ని సీన్స్ మెప్పించడం….

కొన్ని చోట్ల కామెడీ పర్వాలేదు అనిపించడం, పాత్రల పరిచయం బాగుండటం, ఎండ్ టైం లో ధనవంతులు తమని తాము కాపాడుకోవడానికి భావుల్లో దాక్కోవడం, పేదవాళ్ళు ఆ ఒక్క రోజుని ఎంజాయ్ చేయడం లాంటివి బాగున్నా చెప్పిన విధానం చాలా నెమ్మదిగా ఉండటం తో ఆర్ట్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళు, కంప్లీట్ గా కొత్తదనం కోరుకునే వాళ్ళకి మాత్రమే…

సినిమా ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే అవకాశం ఉంది, రెగ్యులర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి సినిమా నీరసం తెప్పించడం ఖాయం. అలా అని మరీ నిరాశ పరచదు కానీ చాలా నెమ్మదిగా సాగే కథనం వలన చాలా ఓపికతో సినిమా చూసే అంత ఆసక్తి ఉంటే వాళ్ళకి సినిమా పర్వాలేదు అనిపిస్తుంది… యాక్టర్స్ అందరూ ఉన్నంతలో బాగానే నటించగా….

సత్యదేవ్, నిత్య మీనన్ రాహుల్ రామకృష్ణ అందరూ ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు పర్వాలేదు అనిపించగా పాటలు నేపధ్య సంగీతం పర్వాలేదు. కానీ డైరెక్షన్ విషయంలో చాలా ఫన్ క్రియేట్ చేస్తూ కథని చెప్పే అవకాశం ఉన్నా చాలా నెమ్మదిగా చెప్పిన విధానం వలన సినిమా కొంత మందికి తప్పితే ఎక్కువమందికి ఎక్కే అవకాశం తక్కువ… ఓవరాల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here