Home న్యూస్ సాలిడ్ క్రేజ్ ఉన్న మూవీ…రిలీజ్ ను ఆపేశారు…కారణం ఇదే!

సాలిడ్ క్రేజ్ ఉన్న మూవీ…రిలీజ్ ను ఆపేశారు…కారణం ఇదే!

0

పరిస్థితులు అన్నీ సద్దుకుని ఇండియాలోనే అన్ని ఇండస్ట్రీలలోకి టాలీవుడ్ వరుస పెట్టి విజయాలను నమోదు చేస్తూ దూసుకు పోతున్న వేల మళ్ళీ అనుకోని అవరోధాలు ఎదురు అవుతున్నాయి. ఇండియా లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ పోతుండటంతో ఆ ఇంపాక్ట్ ఇండస్ట్రీ ల పై స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు. జనవరి నుండి మార్చ్ వరకు వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవ్వగా… ఇప్పుడు కేసుల సంఖ్య పెరుగుతూ పోతుండటం తో కొత్త సినిమా ల పై..

ఆ ఇంపాక్ట్ గట్టిగానే కనిపించేలా ఉంది. ఇక ఆడియన్స్ ముందుకు పవర్ స్టార్ వకీల్ సాబ్ రిలీజ్ అవ్వగా మరో వారం లో రావాల్సిన క్రేజీ మూవీ లవ్ స్టొరీ సడెన్ షాకే ఇచ్చింది అందరికీ… సినిమాకి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది, సినిమా సాంగ్స్ సాలిడ్ క్రేజ్ ను సొంతం చేసుకోవడం…

నాగ చైతన్య సాయి పల్లవి శేఖర్ కమ్ముల ఇలా అందరూ మంచి క్రేజ్ ఉన్న వాళ్ళే కాబట్టి సినిమా మంచి బజ్ ను సొంతం చేసుకోగా… బాక్స్ ఆఫీస్ దగ్గర నాగ చైతన్య కెరీర్ లో మొట్ట మొదటి 50 కోట్ల మూవీ అవుతుంది అనుకున్న ఈ సినిమా ఇప్పుడు…

సడెన్ గా రిలీజ్ ను ఆపేయాల్సి వచ్చింది. అఫీషియల్ గా టీం ప్రెస్ మీట్ పెట్టి సినిమా రిలీజ్ సమయానికి కేసుల సంఖ్య ఇంకా పెరిగేలా ఉండటం తో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి మునుపటిలా రావడం కష్టం కాబట్టి మా సినిమాను రిలీజ్ చేయడం లేదు అని టీం కన్ఫాం చేసింది. మా సినిమా పై మాకు ఫుల్ కాన్ఫిడెంట్స్ ఉందని…

అందుకే పరిస్థితులు సద్దుకున్నాక ఎప్పుడు వచ్చినా ఆడియన్స్ ను అలరించడం ఖాయమని చెప్పుకొచ్చిన టీం ఇప్పుడు 16 న రిలీజ్ ను ఆపేయగా మళ్ళీ పరిస్థితులు సద్దుకున్నాకే ఆడియన్స్ ముందుకు వస్తామని కన్ఫాం చేశారు. మరి ఆ డేట్ ఎప్పుడు అవుతుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here