మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ బాక్ టు బాక్ హిట్స్ తో మళ్ళీ ఫాం అందుకున్న విషయం తెలిసిందే.. కెరీర్ మొదలు పెట్టడం వరుస హిట్స్ తో మొదలు పెట్టిన తర్వాత డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్స్ తో షాక్ ఇచ్చిన సాయి ధరం తేజ్ మార్కెట్ చాలా వరకు కోల్పోయిన స్టేజ్ నుండి మళ్ళీ 2019 లో రెండు వరుస బాక్ టు బాక్ హిట్స్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి సత్తా చాటుకున్నాడు.
ఇక ఇప్పుడు హాట్రిక్ పై దృష్టి పెట్టి ఆశలు పెట్టుకున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అనుకున్నా కానీ కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ రాగా తర్వాత సినిమా డిజిటల్ రిలీజ్ అవుతుంది అన్న టాక్ గట్టిగా వచ్చింది.
రేట్లు కూడా బయట చక్కర్లు కొట్టినా కానీ ఎప్పుడైతే పే పెర్ వ్యూ పద్దతిలో సినిమా రిలీజ్ అనే సరికి టీం దానికి నో చెప్పగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తారా లేక డిజిటల్ రిలీజే చేస్తారా అని ఎదురు చూస్తుండగా థియేటర్స్ రీ ఓపెన్ చేసినా…..
కానీ ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితులలో ఇప్పుడు సాయి ధరం తేజ్ టాలీవుడ్ తరుపున కరోనా తర్వాత థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్న మొదటి సినిమాగా మారబోతుంది. డిసెంబర్ లో ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నామని రీసెంట్ గా అఫీషియల్ గా పోస్టర్స్ ని రిలీజ్ చేసి అప్ డేట్ చేశారు. దాంతో టాలీవుడ్ లో….
పాండమిక్ తర్వాత రిలీజ్ అవ్వబోతున్న మొదటి సినిమాగా మారబోతున్న సోలో బ్రతుకే సో బెటర్ 50% ఆక్యుపెన్సీ తో లాంగ్ రన్ సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి, రెండు రాష్ట్రాలలో కరోనా కొంచం తగ్గుముఖం పట్టగా డిసెంబర్ మొదటి వారం నాటికి పరిస్థితులను బట్టి సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్పాలి.