డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కోసం సాలిడ్ ఆఫర్స్ ను సొంతం చేసుకున్నా కానీ నో చెప్పి థియేటర్స్ లోనే రిలీజ్ అవ్వాలని ముందు డిసైడ్ అయిన సినిమా SR కళ్యాణ మండపం… సినిమా సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం తో ఫస్ట్ నుండే మంచి అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా సుమారు 500 వరకు థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది…
ఫస్ట్ డే నే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సెన్సేషనల్ రేటు పెట్టి సొంతం చేసుకుంది ఆహా వీడియో వాళ్ళు. ఆ రేటు సినిమా బడ్జెట్ కి ఆల్ మోస్ట్ డబుల్ అనిపించే రేంజ్ రేటు అని చెప్పొచ్చు.
సినిమా ఓవరాల్ బడ్జెట్ 1.9 కోట్ల రేంజ్ లో ఉందని సమచారం. ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ 4.55 కోట్ల దాకా జరిగి ఇక్కడే సినిమాకి సాలిడ్ ప్రాఫిట్స్ దక్కాయి. ఇక సినిమా డిజిటల్ రైట్స్ ను ఆహా వీడియో వాళ్ళు 3.5 కోట్ల రేంజ్ రేటు చెల్లించి…
సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ రేంజ్ రేటు అంటే మాస్ అనే చెప్పాలి. ఆల్ మోస్ట్ బిజినెస్ మీద ఓ రేంజ్ లో ప్రాఫిట్ ఇక్కడే దక్కింది అని చెప్పాలి. కానీ ఈ రేంజ్ రేటు పెట్టడానికి రీజన్ కూడా ఉందని అంటున్నారు. అదేంటంటే సినిమా రిలీజ్ అయిన 2 వారాల తర్వాత సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేస్తారనే టాక్ ఉంది.
అందుకోసమే అంత రేటు పెట్టి సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఓవరాల్ గా చిన్న సినిమానే అయినా అల్టిమేట్ బిజినెస్ తో మేకర్స్ కి తిరుగు లేని ప్రాఫిట్స్ ను సొంతం అయ్యేలా చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎంతవరకు కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకుంటుందో త్వరలో తేలనుంది.