Home గాసిప్స్ చిన్న సినిమా అన్నారు…హిందీ డబ్బింగ్ రేటుకే బడ్జెట్ రికవరీ అక్కడా!!

చిన్న సినిమా అన్నారు…హిందీ డబ్బింగ్ రేటుకే బడ్జెట్ రికవరీ అక్కడా!!

0

చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కొంచం హైప్ ఉంటే చాలు ఆ సినిమా ని కొనడానికి బయ్యర్లు ఎగబడతారు, ఆ సినిమా పై బజ్ ఉంటే చాలు జనాలు కూడా థియేటర్స్ లో సినిమాను చూడటానికి తరలి వస్తారు. ఈ ఇయర్ ఇలా కొన్ని సినిమాలు తమ రేంజ్ కి మించి హైప్ ను సొంతం చేసుకుని తర్వాత బాక్స్ ఆఫీస్ ను కూడా షేక్ చేసి సంచలనం సృష్టించాయి.

ఇప్పుడు ఈ కోవ లోకే చేరే మరో సినిమా SR కళ్యాణ మండపం… అవడానికి చిన్న సినిమానే అయినా సాంగ్స్ అండ్ ట్రైలర్ తో ఆడియన్స్ లో మంచి బజ్ ని సొంతం చేసుకుంది. దాంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా…

సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన రిలీజ్ కి ఇబ్బంది ఏర్పడినా డిజిటల్ రిలీజ్ కి ఆఫర్స్ వచ్చినా కానీ నో చెప్పిన టీం థియేటర్స్ లోనే సినిమాను రిలీజ్ చేస్తామని డిసైడ్ అవ్వగా సినిమా బిజినెస్ చాలా బాగా జరుగుతూ వెళ్ళగా ఇప్పుడు సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా…

మంచి రేటుకి అమ్ముడు పోవడం విశేషం. సినిమా ఓవరాల్ బడ్జెట్ మొత్తం కూడా ఒక్క హిందీ డబ్బింగ్ రైట్స్ తోనే రికవరీ అవ్వడం మరో విశేషం, మొత్తం మీద సినిమా 1.9 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మాణం అవ్వగా హిందీ డబ్బింగ్ రైట్స్ కింద 2.1 కోట్ల రేటు ఈ సినిమా కి సొంతం అయ్యిందని ట్రేడ్ లో టాక్ ఉంది. అంటే పెట్టిన డబ్బుకి ఇక్కడే సినిమా కి…

ప్రాఫిట్ వచ్చినట్లు అయింది. మొత్తం మీద సినిమా జాక్ పాట్ కొట్టింది అనే చెప్పాలి. ఆడియన్స్ లో హైప్ ఉన్న మూవీ అవ్వడం తో సాలిడ్ ప్రాఫిట్స్ ని ఇప్పటికే సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here