సాంగ్స్ ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుని ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీని దక్కించుకున్న చిన్న సినిమా SR కళ్యాణ మండపం సాలిడ్ డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ వచ్చినా నో చెప్పి వరల్డ్ వైడ్ గా 500 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను కన్ఫాం చేసుకుంది. మరి సినిమా ఎలా ఉంది ఎంత వరకు అంచనాలను తట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా కథ పాయింట్ కి వస్తే…
ఫ్యామిలీ బిజినెస్ అయిన కళ్యాణ మండపాన్ని నడిపే సాయి కుమార్ ఆ బిజినెస్ ను నాశనం చేసుకుంటాడు… తన తండ్రి ఒకప్పుడు ఉన్న పొజిషన్ ను తిరిగి చూడాలి అని కోరుకునే హీరో కి తన తండ్రి కి పడదు. మరి వీళ్ళు కలిసారా లేదా, హీరో లవ్ స్టొరీ మ్యాటర్ ఏంటి లాంటి విశేషాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమా కథ పాయింట్ చాలా చాలా సాదాసీదాగా అనిపిస్తుంది, కానీ పెర్ఫార్మెన్స్ పరంగా కిరణ్ అబ్బవరం సాలిడ్ పెర్ఫార్మెన్స్ తో మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాడు. హీరోయిజం సీన్స్, కామెడీ సీన్స్ క్లైమాక్స్ సీన్ లో తన పెర్ఫార్మెన్స్ బాగా మెప్పించింది. ఇక సాయి కుమార్ రోల్ కూడా చాలా బాగా తీర్చిదిద్దారు.
ఇక హీరోయిన్ ప్రియాంక రోల్ ఓకే అనిపించగా మిగిలిన రోల్స్ కూడా పర్వాలేదు అనిపించారు, సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి మేజర్ ప్లస్ పాయింట్స్. అవే సినిమా కి ఈ రేంజ్ క్రేజ్ వచ్చేలా చేశాయి. సాంగ్స్ ఎంతబాగా ఆకట్టుకున్నాయో హీరోయిజం సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదే రేంజ్ లో మెప్పించింది. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచం వీక్ గా అనిపించింది.
సెకెండ్ ఆఫ్ లో ఈజీగా ఒక 15 నిమిషాలు కట్ చేయోచ్చు… సినిమాటోగ్రఫీ బాగుంది, డైలాగ్స్ బాగా రాశారు, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే చాలా సింపుల్ స్టొరీ ని కామెడీ, హీరోయిజం అండ్ తండ్రి కొడుకుల సీన్స్ ని జోడించి చాలా వరకు మెప్పించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ శ్రీధర్… కానీ లెంత్ పెంచడం…
సీన్ టు సీన్ కనెక్ట్ మిస్ అవ్వడం మైనస్ పాయింట్స్ అయ్యాయి. తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్ సీన్స్ ని బాగా రాసుకోవడం ఫస్టాఫ్ లో ఎంటర్ టైన్ మెంట్ అక్కడక్కడా బాగానే వర్కౌట్ అవ్వడం, సాంగ్స్ మెప్పించడం, క్లైమాక్స్ బాగుండటం, కిరణ్ అబ్బవరం మరియు సాయి కుమార్ ల పెర్ఫార్మెన్స్ ప్లస్ పాయింట్స్ గా నిలవగా…
లవ్ స్టొరీ వీక్ గా ఉండటం, సెకెండ్ ఆఫ్ ఆ లవ్ స్టొరీ చుట్టూ కథ సాగదీయడం, సెకెండ్ ఆఫ్ లో ట్రాక్ తప్పడం మేజర్ మైనస్ పాయింట్స్, కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఆడియన్స్ ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ సినిమా లో ఉన్నాయి, కానీ అదే టైం లో బోర్ అనిపించే సీన్స్ కూడా ఉన్నాయి. అయినా కానీ కొంచం ఓపికతో చూస్తె సినిమా పూర్తీ అయ్యాక పర్వాలేదు అనిపిస్తుంది సినిమా… ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్… 2.75 స్టార్స్…