బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ శ్రీదేవి సోడా సెంటర్ సినిమా మొదటి వారం వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా చేతులు ఎత్తేయడం తో ఇక సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ ను అందుకునే అవకాశం లేనట్టే అనిపించింది కానీ ఎంతో కొంత బెటర్ గా సినిమా రెండో వీకెండ్ ని పూర్తీ చేసుకుంది. ముఖ్యంగా కొత్త సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర….
ఏమాత్రం జనాలను థియేటర్స్ కి రప్పించలేక పోవడం తో సడెన్ గా సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ఒక్కటే డీసెంట్ ఆప్షన్ గా మారింది ఆడియన్స్ కి… దాంతో ఆదివారం రోజున సినిమాకి చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడటం విశేషం అని చెప్పొచ్చు.
సినిమా తెలుగు రాష్ట్రాలలో రోజు వారి కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Day 1 – 1.32Cr
👉Day 2 – 0.77Cr
👉Day 3 – 0.86Cr
👉Day 4 – 0.39Cr
👉Day 5 – 0.23Cr
👉Day 6 – 0.16Cr
👉Day 7 – 0.13Cr
👉Day 8 – 0.09Cr
👉Day 9 – 0.14Cr
👉Day 10 – 0.36Cr
Total AP TG: 4.46CR(7.40CR Gross)
ఇక సినిమా టోటల్ గా 10 రోజులకు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.52Cr
👉Ceeded: 76L
👉UA: 67L
👉East: 41L
👉West: 24L
👉Guntur: 45L
👉Krishna: 25L
👉Nellore: 16L
AP-TG Total:- 4.46CR(7.40Cr Gross)
KA+ROI: 12L
OS: 26L~
Total Collections: 4.84CR(8.30CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద 10 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్…
10 వ రోజు సినిమా ఊహించని విధంగా మంచి గ్రోత్ ని సొంతం చేసుకుంది కానీ మొత్తం మీద ఇప్పుడు సినిమా 8.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 3.66 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది… వర్కింగ్ డేస్ లో కూడా సినిమా ఇదే మ్యాజిక్ ని కొనసాగిస్తే లాస్ ని మరింతగా తగ్గించే అవకాశం ఎంతో కొంత ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు.