బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన సినిమాలు ఒకటి తర్వాత ఒకటి వరుస పెట్టి రిలీజ్ అవుతూనే ఉండగా ఒక్కటి కూడా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించలేక పోతూ ఉండటం విచారకరం. లేటెస్ట్ గా సంతోష్ శోభన్ నటించిన కొత్త సినిమా శ్రీదేవి శోభన్ బాబు రిలీజ్ అవ్వగా పరమ రొటీన్ కథతో తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ ని సొంతం చేసుకుని…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ దశలో కూడా ఆకట్టుకోలేక పోయింది, సినిమా మొత్తం మీద 2.2 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో 40 లక్షల లోపు గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత మిగిలిన రోజుల్లో మరో…
20 లక్షల లోపు గ్రాస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. దాంతో మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 60 లక్షల లోపు గ్రాస్ ను మాత్రమే అందుకుని పరుగును ముగించగా ఇందులో షేర్ అటూ ఇటూగా 30 లక్షల లోపు ఉంటుందని చెప్పాలి…
ఇవి కూడా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా చెబుతున్న కలెక్షన్స్ కాగా మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంతోష్ శోభన్ కి ఈ ఇయర్ కళ్యాణం కమనీయం తర్వాత రెండో ఫ్లాఫ్ మూవీ గా నిలిచింది అని చెప్పాలి. ఇక ఫ్యూచర్ లో ఏ సినిమాతో హిట్ కొడతాడో చూడాలి.