Home న్యూస్ పాపం శ్రీ విష్ణు…ఎదురు డబ్బులిచ్చి రిలీజ్ చేస్తే మైండ్ బ్లాంక్ అయింది!!

పాపం శ్రీ విష్ణు…ఎదురు డబ్బులిచ్చి రిలీజ్ చేస్తే మైండ్ బ్లాంక్ అయింది!!

0

టైం బాలేనప్పుడు ఎవ్వరూ ఏమి చేయలేరు, లాస్ట్ ఇయర్ రాజ రాజ చోర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీ విష్ణు తర్వాత చేసిన సినిమాలు అన్నీ కూడా వరుస పెట్టి ఒకటి తర్వాత ఒకటి డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. ఇలాంటి టైం లో మాస్ కంటెంట్ తో తిరిగి కంబ్యాక్ ని గట్టిగా ఇస్తానని నమ్మకంతో ఉన్న శ్రీ విష్ణు తన లేటెస్ట్ మూవీ అల్లూరి పై చాలా నమ్మకం…

పెట్టుకున్నాడు కానీ ఈ సినిమా ఆ నమ్మకాన్ని నిజం చేయలేక పోయింది, దాని కన్నా ముందు సినిమా రిలీజ్ కూడా అనుకున్న విధంగా జరగలేదు, సినిమా షూటింగ్ టైం లో ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు కానీ రిలీజ్ టైం లో సినిమా నిర్మాత…

ప్రీవియస్ మూవీస్ లాస్ ఇంపాక్ట్ వలన ఈ సినిమా రిలీజ్ ను ఆపేశారు…. దాంతో రిలీజ్ రోజున సినిమా ఇబ్బందులను ఫేస్ చేయడం చూసిన శ్రీ విష్ణు సినిమా మీద నమ్మకంతో ఆ నిర్మాత అప్పులకు పూచికత్తుగా 2 కోట్ల చెక్ తో ఫైనాన్స్ ఇబ్బందులను సెట్ చేసి అల్లూరి సినిమాను సజావుగా…

మ్యాట్నీ షోల నుండి రిలీజ్ అయ్యేలా సహాయం చేశాడు, సినిమా కి పర్వాలేదు అనిపించే రేంజ్ టాక్ కూడా లభించింది కానీ జనాలు అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి అయితే తరలి రాలేదు, దాంతో టాక్ కొంచం పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నా వీకెండ్ లో సినిమా వసూళ్లు తీవ్రంగానే నిరాశ పరిచాయి అని చెప్పాలి ఇప్పుడు. దాంతో ఎదురు డబ్బులు చెల్లించి సినిమాను….

సజావుగా రిలీజ్ చేసేందుకు హెల్ప్ చేసిన హీరో సినిమా మీద నమ్మకంతో ఉన్నప్పటికీ జనాలు మాత్రం సినిమా ను అనుకున్న విధంగా ఆదరించలేదు. దాంతో శ్రీ విష్ణు ఫ్లాఫ్ మూవీస్ స్ట్రీక్ లో ఇప్పుడు అల్లూరి కూడా యాడ్ అయ్యింది అని చెప్పాలి. ఇక ఫ్యూచర్ లో చేసే ఏ సినిమాతో మంచి కంబ్యాక్ ని సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here