Home న్యూస్ బాలీవుడ్ న్యూ రికార్డ్ తో కింగ్ ఖాన్ కి ఫ్యాన్స్ గిఫ్ట్…24 గంటల రిపోర్ట్!

బాలీవుడ్ న్యూ రికార్డ్ తో కింగ్ ఖాన్ కి ఫ్యాన్స్ గిఫ్ట్…24 గంటల రిపోర్ట్!

0

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి చాలా టైం అవుతుంది, 2018 టైం లో జీరో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన షారుఖ్ ఆ సినిమా ఊహకందని డిసాస్టర్ అవ్వడంతో అప్పటి నుండి కొత్త సినిమాలు ఏవి ఒప్పుకోలేదు, ఇంతలో కోవిడ్ కూడా ఎంటర్ అవ్వడంతో సినిమాల ఎంపిక విషయంలో మరింత టైం తీసుకున్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు 2023 లో వరుస పెట్టి సినిమాలను రిలీజ్ చేయనున్నాడు.

అందులో ముందుగా పటాన్ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే జనవరి 25న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా అఫీశియల్ టీసర్ ను రీసెంట్ గా షారుఖ్ పుట్టిన రోజున రిలీజ్ చేయగా టీసర్ కి ఆడియన్స్ నుండి…

ఎక్స్ లెంట్ రెస్పాన్స్ దక్కగా వ్యూస్ పరంగా కొత్త రికార్డులు ఏమి నమోదు చేయలేదు కానీ లైక్స్ పరంగా మాత్రం 24 గంటల్లో బాలీవుడ్ రికార్డ్ ను నమోదు చేసింది, ఇది వరకు ఓన్లీ టీసర్ ల పరంగా హృతిక్ రోషన్ నటించిన విక్రమ్ వేద టీసర్ కి 913K లైక్స్ దక్కగా…

ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి 24 గంటల్లో ఏకంగా 1.17 మిలియన్ లైక్స్ తో ఆల్ టైం న్యూ రికార్డ్ ను నమోదు చేసింది, వ్యూస్ పరంగా యూట్యూబ్ లో అప్ డేడెడ్ వ్యూస్ 17 మిలియన్ మార్క్ ని అందుకోగా సోషల్ మీడియా లో అన్ని వ్యూస్ కలిపి 80 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ టీసర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here