కొన్ని కొన్ని సార్లు అనుకునో అనుకోకుండా డైరెక్టర్ ల చేతిలో నుండి కొన్ని సినిమాలు మిస్ అవుతూ ఉంటాయి, వాటి గురించి కొందరు చెబుతారు, కొందరు సైలెంట్ గా ఉండిపోతారు, టాలీవుడ్ లో రన్ రాజా రన్ తో అడుగు పెట్టి మంచి విజయాన్ని తొలి సినిమా తోనే సొంతం చేసుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్ రెండో సినిమా ఏకంగా ప్రభాస్ తో పాన్ ఇండియా లెవల్ లో తీసే ఛాన్స్ దక్కింది.
ఏకంగా 350 కోట్ల రేంజ్ బడ్జెట్ తో టెక్నికల్ గా అదుర్స్ అనిపించిన సాహో కథలో దమ్ము లేకపోవడంతో నిరాశ పరచగా సుజిత్ అప్ కమింగ్ మూవీస్ పై ఇది ఇంపాక్ట్ చూపింది. రామ్ చరణ్ తో సినిమా అనుకుంటే చిరు తో సినిమా సెట్ అయింది…
కానీ అది మారి లూసిఫర్ రీమేక్ ఆఫర్ వచ్చింది, కానీ కథ సరిగ్గా మార్చలేక పోవడం తో ఆ అవకాశం చేయి జారగా రీసెంట్ గా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఛత్రపతి ని హిందీ లో రీమేక్ చేసే అవకాశం సుజిత్ కి దక్కింది, భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధం అయ్యారు కానీ సుజిత్ మాత్రం…
రీసెంట్ గా ఇంస్టగ్రామ్ లో ఒక కామెంట్ కి రిప్లే ఇస్తూ నేను ఇప్పుడు ఏ రీమేక్ సినిమా కూడా చేయడం లేదూ అంటూ 2 సినిమాల క్లారిటీ ని ఒకసారి ఇచ్చేశాడు. దాంతో అఫీషియల్ గా లూసిఫర్ రీమేక్ నుండి అలాగే ఇప్పుడు ఛత్రపతి హిందీ రీమేక్ లో తను పని చేయడం లేదని క్లియర్ చేసిన సుజిత్ ఇప్పుడు.
బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ రాజా రన్ టైప్ మూవీ తో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కథని సిద్దం చేస్తున్న సుజిత్ ఈ సినిమాను కూడా UV క్రియేషన్స్ బ్యానర్ లోనే చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఆ సినిమా తో అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.