Home టోటల్ కలెక్షన్స్ 2.75 రేటింగ్…అయినా వచ్చింది ఇది….పాపం సుమంత్!!

2.75 రేటింగ్…అయినా వచ్చింది ఇది….పాపం సుమంత్!!

0

టాలీవుడ్ లో బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్ళు అందరూ సక్సెస్ అవ్వరు కానీ అడపా దడపా కొన్ని మంచి సినిమాలు చేసినా కానీ పెద్దగా మార్కెట్ ను సొంతం చేసుకోలేక పోయిన హీరోగా సుమంత్ ని చెప్పుకోవాలి. అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలు చేస్తున్నా వాటిని సరిగ్గా ప్రమోట్ చేసుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకుంటూ వస్తున్నాడు. లేటెస్ట్ గా సుమంత్ నటించిన కొత్త సినిమా కపటధారి రీసెంట్ గా…

ఆడియన్స్ ముందుకు రాగా సినిమా కి యావరేజ్ గా 2.75 రేంజ్ లో రేటింగ్ దక్కింది. కానీ ఆడియన్స్ మాత్రం థియేటర్స్ కి తరలి రాలేదు, దానికి కారణం సినిమా యూనిట్ మినిమమ్ పబ్లిసిటీ లాంటివి చేయలేదు, జనాలకు అసలు ఈ సినిమా రిలీజ్ అయింది అన్న విషయం కూడా తక్కువే తెలుసు.

ఇక సినిమా బిజినెస్ ట్రేడ్ లో వినిపించిన లెక్కలు 1.9 కోట్లు కాగా నిర్మాత అఫీషియల్ గా సినిమా కి మొత్తం మీద 3 ఏరియాల్లో బిజినెస్ జరిగింది అని, మిగిలిన ఏరియాలు ఓన్ గా రిలీజ్ చేసుకున్నామని చెప్పుకొచ్చారు. మొత్తం మీద బిజినెస్ 43 లక్షలు అని చెప్పారు.

కానీ ఓన్ రిలీజ్ అయినా చాలా చోట్ల డెఫిసిట్ లు నెగటివ్ షేర్ లు సొంతం చేసుకున్న సినిమా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపలేక పోయింది. ఒకసారి అన్ని ఏరియాల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 9L
👉Ceeded: 4L
👉UA: 5L
👉East: 4L
👉West: 3L
👉Guntur: 5L
👉Krishna: 3L
👉Nellore: 1.6L
AP-TG Total:- 0.35CR (0.65Cr Gross~)
KA + ROI: 2L
OS – 4L
Total: 0.41Cr(0.75Cr~ Gross)

ఇందులో కూడా చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు, నెగటివ్ షేర్ లు పడ్డాయి, అవి కూడా తీసేస్తే ఇక మిగిలేది చిల్లరే కాబట్టి తీయలేదు కానీ ఓవరాల్ గా డీసెంట్ రివ్యూ లతో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచి ఫ్లాఫ్ అయింది, సోలో రిలీజ్ లేదా OTT రిలీజ్ చేసి ఉన్నా బెటర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని ఉండేదేమో ఈ సినిమా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here